Telugu News » Revanth Reddy : అలా అయితే నామినేషన్ వెనక్కి తీసుకుంటా… లేదంటే కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా….!

Revanth Reddy : అలా అయితే నామినేషన్ వెనక్కి తీసుకుంటా… లేదంటే కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా….!

ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్సే అని అన్నారు. ఉచిత కరెంట్ ఇవ్వకుంటే కేసీఆర్ (KCR) ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

by Ramu
revanth reddy fire on errabelli dayakar rao

రాష్ట్రంలో 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చినట్లు నిరూపిస్తే తన నామినేషన్ వెనక్కి తీసుకుంటానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) సవాల్ విసిరారు. ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్సే అని అన్నారు. ఉచిత కరెంట్ ఇవ్వకుంటే కేసీఆర్ (KCR) ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

revanth reddy fire on errabelli dayakar rao

పాలకుర్తిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ…..
పాలకుర్తి అంటేనే పౌరుషాలకు కేరాఫ్ అని అన్నారు. దోపిడి సొమ్ముతో ఓటర్లను కొనాలని ఎర్రబెల్లి దయాకర్ రావు చూస్తున్నాడని ఆయన ఆరోపించారు. రేషన్ డీలర్‌గా ఉన్న ఎర్రబెల్లికి వేలాది ఎకరాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

దందాలు చేసి వేల కోట్ల రూపాయలను ఎర్రబెల్లి సంపాదించాడని వెల్లడించారు. ప్రజ ధనాన్ని దోచుకుని అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు. డీలర్ దయాకర్ ఇప్పుడు డాలర్ దయాకర్ రావు ఎలా అయ్యాడని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఎర్రబెల్లి మోసాలకు నవబంర్ 30న బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

రాజ్యసభ సీట్లను వందల కోట్లకు కేసీఆర్ అమ్ముకున్నాడని రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. శత్రువులతో చేతులు కలిపి తెలుగు దేశం పార్టీకి ఎర్రబెల్లి నమ్మకద్రోహం చేశాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో ఎర్రబెల్లిని బొంద పెట్టాలన్నారు. పాలకుర్తిలో అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందన్నారు. పాలకుర్తిలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనన్నారు.

You may also like

Leave a Comment