తెలంగాణ (Telangana)లో గెలుపే ధ్యేయంగా కాంగ్రెస్.. బీఆర్ఎస్ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే పాము ముంగిసలా పోట్లాడుకుంటున్న ఈ రెండు పార్టీలు.. మాటలతో విమర్శల అస్త్రాలు ప్రయోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ (BRS) నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ మాటలకు మంత్రి ఎర్రబెల్లి కూడా ఘాటుగా సమాధానాలు ఇచ్చారు. రేవంత్ రెడ్డి జీవిత చరిత్ర ఏంటో తనకు తెలుసని.. బ్లాక్ మెయిల్ చేసి సంపాదించిన లెక్కలన్ని సమయం వచ్చినప్పుడు బయట పెడతానని ఎర్రబెల్లి దయాకర్ (Errabelli Dayakar ) మండిపడ్డాడు.. ఒక ఐటమ్ సాంగ్ లో ఉన్న క్యారెక్టర్ లాంటోడు రేవంత్ రెడ్డి అని తెలిపిన ఎర్రబెల్లి.. తాను టీడీపీలో ఉన్నప్పుడే చంద్రబాబుతో ఈ మాట అన్నానని పేర్కొన్నారు..
మరోవైపు రాజకీయాల్లోకి రాకముందు రేవంత్ రెడ్డి ఒక పెయింటర్ అని.. ఈ స్థాయికి రావడానికి ఎందరినో బ్లాక్ మెయిల్ చేశాడాని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం తామంతా రాజీనామాలు చేస్తే రేవంత్ రెడ్డి చేయలేదని ఈ సందర్భంగా ఎర్రబెల్లి గుర్తు చేశారు. మరోవైపు టీడీపీ (TDP)కి నమ్మక ద్రోహం చేసిన ఎర్రబెల్లి..తాను జైలుకు వెళ్లడానికి కారణం అయ్యారని.. దయ అంటే ఎరుగని దయాకర్ నమ్మించి మోసం చేయడంలో ఘనుడని రేవంత్ రెడ్డి.. నిన్న ఎర్రబెల్లి దయాకర్ రావు పై మండిపడ్డ విషయం తెలిసిందే.
కాంగ్రెస్ (Congress) నేతల ఇళ్లలో మాత్రమే ఐటీ దాడులు చేపిస్తూ మానసిక బలాన్ని దెబ్బతీయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తుందన్న రేవంత్.. గులాబీ నేతల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. అలా ఎర్రబెల్లి వర్సెస్ రేవంత్ విమర్శలు తారా స్థాయికి చేరుకుని వ్యక్తిగత ఆరోపణల దగ్గరికి దారితీసాయి.