తెలంగాణ (Telangana)లో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రతిపక్షాలు అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ (KCR) ఓటమే టార్గెట్ గా బీజేపీ (BJP) కాంగ్రెస్ (Congress) బీఎస్పీ వ్యూహాలు రచిస్తున్నాయని అనుకుంటున్నారు.. సందట్లో సడేమియాల బీఆర్ఎస్ (BRS) శ్రేణులు మాత్రం కేసీఆర్ మూడో సారి ముచ్చటగా సీఎం అవుతారనే ధీమాలో ఉన్నారు.
ఈ రాజకీయ చిత్రంలో ఎంతో హడావుడి చేసిన వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాత్రం ఎన్నికల నుంచి డ్రాప్ అయ్యి వైఎస్సార్‌టీపీ కార్యకర్తల ఆగ్రహానికి గురైనట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా షర్మిల సీఎం కేసీఆర్ పై ట్విట్టర్ (X) వేదికగా ప్రశ్నల దాడి చేశారు. రైతుల పాలిట రక్కసిగా మారిన.. కేసీఆర్ (KCR) మానస పుత్రిక అయిన ధరణి (Dharani Portal) ఆయనకు మాత్రం ధనాగారంగా మారిందని ఆరోపించారు.
ఎన్నికల సంధర్భంగా సమర్పించిన కేసీఆర్ అఫిడవిట్ చూస్తేనే ధరణి తప్పుల తడకని అర్థమైతుందని షర్మిలా (Sharmila) మండిపడ్డారు. మరోవైపు ముఖ్యమంత్రికి గుంట భూమి ఎక్కువొచ్చిందంటే సామాన్యుల సంగతి దేవుడెరుగని షర్మిల వెల్లడించారు. భూమి ఉన్నోళ్లకు లేనట్టుగా, జాగా లేనోళ్లకు ఉన్నట్టుగా, సర్వే నెంబర్లతో సహా మార్చి చూపించే మాయాజాలమే ధరణి అంటూ షర్మిల ఎద్దేవా చేశారు..
మరోవైపు షర్మిల రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధరణి గోసలే అని మండిపడ్డారు. ధరణి భూ వివాదాల కోసం తేలేదన్న షర్మిల.. దొర భూ దోపిడీ కోసమే తెచ్చుకున్న పథకం అని ఆరోపించారు. ప్రజలకు ధరణి తిప్పలు తప్పాలంటే దొర నియంత పాలనను బొంద పెట్టుడు ఒక్కటే మార్గం అంటూ షర్మిల ట్విట్టర్ (X) వేదికగా విమర్శలు చేశారు..