Telugu News » IT Raids: హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ దాడులు.. మంత్రి సబితారెడ్డి బంధువుల ఇళ్లలో సోదాలు..!

IT Raids: హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ దాడులు.. మంత్రి సబితారెడ్డి బంధువుల ఇళ్లలో సోదాలు..!

మరోసారి ఐటీ దాడులు(IT Raids) కలకలం రేపాయి. తాజాగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indra Reddy) బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.

by Mano
IT Raids: IT raids again in Hyderabad.. Minister Sabitha Reddy's relatives' houses were searched..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections) కు మరో 17రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి ఐటీ దాడులు(IT Raids) కలకలం రేపాయి. తాజాగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indra Reddy) బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి నగరంలో మొత్తం 15 చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి.

Air Pollution: Purchased tapas.. Pollution is the same..!

నాలుగు రోజుల క్రితం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంపై కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఖమ్మంతో పాటు హైదరాబాద్‌లోని ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరిగాయి. వారం రోజులక్రితం మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు పారిజాత నరసింహారెడ్డి, ఆ పార్టీ అభ్యర్థి కేఎస్ఆర్, మాజీ మంత్రి జానారెడ్డి నివాసాలపై కూడా ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే.

ఈ దాడులపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ.. బీజేపీ, బీఆర్ఎస్‌లు పరస్పరం కుమ్మక్కయ్యాయని, తమ పార్టీ నేతల ఇళ్లను టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికలకు ముందు గ్రూపుల వారీగా ఐటీ దాడులు చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఫార్మా కంపెనీ యజమాని, డైరెక్టర్, సిబ్బంది, ఇంటి కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు.

మొన్నటి వరకు రాజకీయ నాయకులను టార్గెట్ చేసిన ఐటీ అధికారులు ఇప్పుడు ఫార్మా కంపెనీలను టార్గెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నేతలకు ఫార్మా కంపెనీలు నిధులు ఇస్తారనే అంచనాతో ఈ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.

You may also like

Leave a Comment