Telugu News » IT Rides : హైదరాబాద్‌లో ముగిసిన ఐటీ రెయిడ్స్.. బీఆర్ఎస్ మహిళా మంత్రిపై అనుమానం..?

IT Rides : హైదరాబాద్‌లో ముగిసిన ఐటీ రెయిడ్స్.. బీఆర్ఎస్ మహిళా మంత్రిపై అనుమానం..?

రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న ఐటీ సోదాలు ముగిశాయి. ప్రముఖ ఫార్మా కంపెనీ ఛైర్మన్‌ నివాసంతో పాటు సీఈఓ, ఎండీ ఇతర ఉద్యోగుల నివాసాలతో పాటుగా.. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం పటేల్ గూడలో ఏక కాలంలో అధికారులు తనిఖీలు చేపట్టారు.

by Venu

తెలంగాణ (Telangana)లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది మొదలు.. ప్రత్యేక ఫోకస్ పెట్టారు ఐటీ (IT) అధికారులు అని చర్చ సాగుతుంది. ఇప్పటికే మహేశ్వరం కాంగ్రెస్‌ అభ్యర్థి కేఎల్‌ఆర్‌, బడంగ్‌పేట్‌ మేయర్‌ పారిజాత, గిరిధర్‌రెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ (BRS) నాయకురాలు టార్గెట్‌గా.. పక్కా సమాచారంతోనే ఐటీ అధికారులు రెయిడ్స్ నిర్వహించినట్టు ప్రచారం జరుగుతుంది.

మరోవైపు రెండు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న ఐటీ సోదాలు ముగిశాయి. ప్రముఖ ఫార్మా కంపెనీ ఛైర్మన్‌ నివాసంతో పాటు సీఈఓ, ఎండీ ఇతర ఉద్యోగుల నివాసాలతో పాటుగా.. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం పటేల్ గూడలో ఏక కాలంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఫార్మా కంపెనీ డైరెక్టర్స్ అయిన ప్రదీప్‌ రెడ్డి నివాసంలో ఐదు కోట్ల నగదు, నరేందర్ రెడ్డి నివాసంలో ఏడున్నర కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.

కాగా ఎన్నికల ఖర్చు కోసమే మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) నగదు ఉంచినట్టు వార్తలు వ్యాపిస్తున్నాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్‌ నాయకులు టార్గెట్‌‌గా ఐటీ రెయిడ్స్ (Rides) జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఫార్మా కంపెనీ యజమాని లక్ష్యంగా ఐటీ రెయిడ్స్ జరగడం.. అందులో భారీగా నగదు పట్టుబడటం స్థానికంగా సంచలనం సృష్టించింది. మరోవైపు కొందరికి పలు అనుమానాలు రేకెత్తిస్తుందని అనుకుంటున్నారు.

You may also like

Leave a Comment