Telugu News » Uttarakhand Tunnel: 90 గంటలుగా సొరంగంలోనే 40మంది కార్మికులు.. కొనసాగుతున్న రెస్క్యూ..!

Uttarakhand Tunnel: 90 గంటలుగా సొరంగంలోనే 40మంది కార్మికులు.. కొనసాగుతున్న రెస్క్యూ..!

ఉత్తరాఖండ్‌(Uttarakhand)లోని ఉత్తరకాశీలో చోటుచేసుకున్న సొరంగం(Tunnel) ప్రమాదంలో చిక్కుకున్న వారి పరిస్థితి రోజురోజుకు ఆందోళన కలిగిస్తోంది. కార్మికులను ఎలా సురక్షితంగా రక్షించాలనే దానిపై, థాయ్‌లాండ్, నార్వే నుంచి ప్రత్యేక రెస్క్యూ బృందాలను కూడా సంప్రదించారు.

by Mano
Uttarakhand Tunnel: 40 workers in the tunnel for 90 hours.. Ongoing rescue..!

ఉత్తరాఖండ్‌(Uttarakhand)లోని ఉత్తరకాశీలో చోటుచేసుకున్న సొరంగం(Tunnel) ప్రమాదంలో చిక్కుకున్న వారి పరిస్థితి రోజురోజుకు ఆందోళన కలిగిస్తోంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడడానికి రెస్క్యూ టీమ్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కార్మికులు చిక్కుకున్న చోట 50మీటర్లకు పైగా శిథిలాలు ఉన్నాయి. నాలుగో రోజు విదేశాల నుంచి తెప్పించిన యంత్రాలతో సహాయకచర్యలను కొనసాగిస్తున్నారు.

Uttarakhand Tunnel: 40 workers in the tunnel for 90 hours.. Ongoing rescue..!

సొరంగంలో ఇంకా 40 మంది కార్మికులు చిక్కుకుపోయారు. నాలుగు రోజులు గడిచినా సహాయక చర్యలకు సాంకేతిక సమస్యల కారణంగా అంతరాయం ఏర్పడుతోంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు భారత వైమానిక దళం మూడు ప్రత్యేక విమానాల్లో 25 టన్నుల పైపులను పంపుతోంది. ఉత్తరకాశీలో సహాయక చర్యల కోసం అధికారులు విదేశీ నిపుణుల సాయాన్ని తీసుకుంటున్నారు.

కార్మికులను ఎలా సురక్షితంగా రక్షించాలనే దానిపై, థాయ్‌లాండ్, నార్వే నుంచి ప్రత్యేక రెస్క్యూ బృందాలను కూడా సంప్రదించారు. సొరంగంలో చిక్కుకున్న వారికి ఆక్సిజన్, నీరు, ఆహారం పైపుల ద్వారా పంపుతున్నారు. ఇప్పటికే సొరంగం వద్ద 800మి.మీల వెడల్పు గల స్టీల్ పైపును అమర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో నుంచి ఒక్కొక్కరిగా బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

మరోవైపు వాయుసేన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి ప్రత్యేక యంత్రాలను తెప్పిస్తున్నారు. ఈ యంత్రం ఒక గంటలో 4-5 మీటర్ల వరకు రాళ్లను తవ్వగలదు. ఉత్తరకాశీ సొరంగంలో ఈ యంత్రాన్ని ఉపయోగించగలిగితే.. పెద్ద పైపును అమర్చి కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావచ్చు. ఇవాళ(గురువారం) నుంచి ఈ యంత్రాన్ని వినియోగించే అవకాశం ఉంది.

మరోవైపు, 2018లో థాయ్‌లాండ్‌లోని గుహలో చిక్కుకున్న చిన్నారులను రక్షించేందుకు సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టిన సంస్థను కూడా అధికారులు సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆ సంస్థ దాదాపు 10వేల మంది కార్మికులతో వారం రోజుల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత జూనియర్ అసోసియేషన్ ఫుట్‌బాల్ జట్టును రక్షించిన సంగతి తెలిసిందే. ఈ బృందం అనుభవాన్ని ఉపయోగించి ఉత్తరకాశీలో కార్మికులను ఎలా రక్షించాలనే దానిపై సాయం కోరింది.

You may also like

Leave a Comment