Telugu News » Ghee Health : నెయ్యి తింటున్నారా.. ఈ విషయాలు తెలియకుంటే నష్టమే..?

Ghee Health : నెయ్యి తింటున్నారా.. ఈ విషయాలు తెలియకుంటే నష్టమే..?

ఆయుర్వేద శాస్త్ర ప్రకారం శరీరం వెచ్చగా ఉండడానికి నెయ్యి సహాయపడుతుంది. అందువల్ల జలుబు, ముక్కు దిబ్బడతో బాధపడే వారికి ముక్కులో తరచుగా ఇన్ఫెక్షన్ వచ్చేవారికి నెయ్యి ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

by Venu

వేడి వేడి అన్నంలోకి ఇంత పప్పు లేదా ఆవకాయ అందులో నెయ్యి వేసుకుని తింటే.. ఆ రుచే వేరు.. అదీగాక ఆయుర్వేద శాస్త్రం కూడా నెయ్యి (Ghee) వల్ల చాలా లాభాలు ఉన్నాయని వెల్లడించింది. మరి అలాంటి నెయ్యి వల్ల కలిగే బెనిఫిట్స్ (Benefits).. ప్రాబ్లమ్స్ ( Problems) ఏంటో తెలుసుకుందాం..

మనిషి రోజు తీసుకునే ఆహారంలో తగిన మోతాదులో నెయ్యి తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. ఈ నెయ్యిని తీసుకునే ఆహారంలో భాగంగా చేసుకుంటే ముక్కు దిబ్బడ, జీర్ణాశయ సమస్యలు, కీళ్లనొప్పలు, శరీరంలో మంట, వాపును తగ్గించడంలో తోడ్పడుతుందని ఆరోగ్యనిపుణులు (Health professionals) చెబుతున్నారు.

ఆయుర్వేద శాస్త్ర ప్రకారం శరీరం వెచ్చగా ఉండడానికి నెయ్యి సహాయపడుతుంది. అందువల్ల జలుబు, ముక్కు దిబ్బడతో బాధపడే వారికి ముక్కులో తరచుగా ఇన్ఫెక్షన్ వచ్చేవారికి నెయ్యి ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

నెయ్యి తినడం వల్ల ఇందులో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో వాపు, లేదా ఏదైనా గాయాల మంటను తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల కీళ్ల నొప్పులు తగ్గే అవకాశం ఉందంటున్నారు. కీళ్లు, కణజాలాన్ని లూస్ చేయడానికి ఒక లూబ్రికెంట్ లా నెయ్యి పని చేస్తుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.

నెయ్యిలో ఫ్యాట్ సోలబులే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడానికి దోహదపడుతుందని ఆరోగ్యనిపుణులు తెలుపుతున్నారు. నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ వేడి నీటితో కలిసినప్పుడు జీర్ణక్రియ మెరుగ్గా జరగడానికి తోడ్పడుతుందని, మలబద్దకం, కడుపుబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలను దూరం చేసి పోషకాల శోషణకు సహయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

మరోవైపు పాల ఉత్పత్తుల వల్ల అలెర్జీ సమస్యలు ఉన్నవారు.. గుండె సమస్యలు లేదా అధిక కొలెస్ట్రాల్.. కాలేయ సమస్యలు లేదా కాలేయ సిర్రోసిస్, హెపటైటిస్, స్ప్లెనోమెగలీ సమస్యలు ఉంటే నెయ్యి వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీకు అనారోగ్య సమస్యలు లేకుంటే, నెయ్యిని మితంగా తినవచ్చని, అయితే, మీ ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు మీ వైద్యుడిని సంప్రదించండం మంచిదని నిపుణులు అంటున్నారు.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ విషయాలు చెప్పడం జరిగింది.. వీటిని ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి..

You may also like

Leave a Comment