Telugu News » Chidambaram : హైదరాబాద్ అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ కాదు.. రహస్యాన్ని బయట పెట్టిన సీనియర్ నేత..!!

Chidambaram : హైదరాబాద్ అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ కాదు.. రహస్యాన్ని బయట పెట్టిన సీనియర్ నేత..!!

కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత చిదంబరం.. బీఆర్ఎస్ పాలన తీరుపై మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. మాట తప్పకుండా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే.. కేసీఆర్ తెలంగాణను ఆగం చేశారని చిదంబరం విమర్శించారు.

by Venu

తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) చూసిన చిత్రాలు.. విన్న మాటలు జీవితంలో మరచిపోని విధంగా ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు.. సవతుల పొరుకన్నా నేతల పోరు మించిపోయిందని నవ్వుకుంటున్నారు. ఈ టామ్ అండ్ జెర్రీ ఆట ఎన్నికలు జరిగే వరకి మాత్రమే ఆతర్వాత అంతా సైలంట్ అవుతారని అనుకుంటున్నారు.

మరోవైపు ప్రపంచ యుద్ధాలను తలపించేలా కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS) పోరు జరుగుతున్నట్టు కనిపిస్తుంది. రెండు పార్టీలు గతాలను తవ్వుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత చిదంబరం.. బీఆర్ఎస్ పాలన తీరుపై మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. మాట తప్పకుండా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే.. కేసీఆర్ తెలంగాణను ఆగం చేశారని చిదంబరం విమర్శించారు.

తన కుటుంబం బాగుకోసం తొమ్మిదిన్నర ఏళ్లుగా రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్.. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. నిరుద్యోగం, అధిక ధరల నియంత్రణలో కేసీఆర్ సర్కార్ విఫలమైందన్న చిదంబరం.. విద్య కోసం నిధులు కేటాయించకుండా ప్రజలను మోసం చేస్తూ పాలన చేస్తుందని మండిపడ్డారు..

ఇతర రాష్ట్రాల కంటే హైదరాబాద్ లోనే గ్యాస్ సిలిండర్ ధర ఎక్కువ ఉందన్న చిదంబరం.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80వేల ప్రభుత్వ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయకుండా నిరుద్యోగుల ఊసురు తీస్తుందని ఆగ్రహించారు చిదంబరం (Chidambaram)..అవినీతికి కేరాఫ్ గా మారిన కేసీఆర్ ప్రతి తెలగాణ పౌరుడి తలపై సగటునా లక్ష రూపాయల అప్పు వేశారని ఆరోపించారు.

బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో బ్రతుకు వెల్లదీస్తున్నారని.. ఇక చాలంటూ కారుకు బై బై చెప్పడానికి సిద్దమైనట్టు చిదంబరం వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్ర అభివృద్థి జరిగిందని.. కాంగ్రెస్ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చిదంబరం తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని చిదంబరం తెలిపారు.

You may also like

Leave a Comment