తెలంగాణ (Telangana) ప్రజలను 58 ఏండ్ల పాటు కాంగ్రెస్ (Congress) ఇబ్బంది పెట్టిందని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. తెలంగాణను ఏపీలో కలిపింది కాంగ్రెస్సేనని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. బీజేపీకి మత పిచ్చి తప్ప మరేమీ లేదని మండిపడ్డారు. దేశంలో 157 వైద్య కళాశాలలను పెడితే అందులో తెలంగాణలో ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు.
కరీంనగర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. సుమారు ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ఇబ్బంది పెట్టిందన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమకారులను అప్పటి కాంగ్రెస్ సర్కార్ పిట్టల్లాగా కాల్చి చంపిందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో పింఛన్ రూ. 200 ఉండేదన్నారు.
తమ ప్రభుత్వం వచ్చాక వందల్లో ఉన్న పింఛన్‌ను వేలల్లోకి పెంచామన్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపడుతారని ఎవరైనా ఊహించారా ? అని అడిగారు. కంటి వెలుగులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించామన్నారు. 80 లక్షల మందికి అద్దాలు పంపిణీ చేశామని సీఎం గుర్తు చేశారు.
తెలంగాణ ఏర్పడిన సమయంలో తలసరి ఆదాయంలో దేశంలో మనం 19వ స్థానంలో ఉన్నామన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రథమస్థానంలో ఉందన్నారు. అటు తలసరి విద్యుత్ వినియోగంలోనూ మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. సాగునీటిపై గతంలో పన్ను ఉండేదన్నారు. కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక దాన్ని రద్దు చేశామన్నారు.
ధరణి పోర్టల్ ద్వారా అద్భుతమైన ఫలితాలు వచ్చాయ పేర్కొన్నారు. ధరణి వచ్చాక దళారులు లేకుండా పోయారని వెల్లడించారు. ధరణి వల్ల రైతులు గడపదాటకుండానే వారి ఖాతాల్లో నగదు జమ అవుతోందన్నారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని రాహుల్ గాంధీ అంటున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.
ధరణిని తీసేస్తే రైతుబీమా, రైతుబంధు, ధాన్యం డబ్బులు ఎలా వస్తాయంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో అనుకున్న స్థాయిలో పరిణితి రాలేదన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణితి వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. అభ్యర్థుల గుణగణాలను విచారించిన తర్వాతే ఓటు వేయాలని సూచించారు.
గతంలో లోయర్ మానేరు డ్యామ్ ఎలా ఉండేదని ఆయన ప్రశ్నించారు. డ్యామ్ ఉన్నా తాగేందుకు నీళ్లు ఉండేవి కాదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఎల్‌ఎండీకి ప్రత్యేక నిధులు కేటాయించామన్నారు. కేంద్రం ఇవ్వకున్నా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4 వైద్య కళాశాలలను తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. చట్టం ప్రకారం ప్రతి జిల్లాలో ఒక నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలన్నారు. కానీ చట్టాలు ఉన్నప్పటికీ తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదన్నారు.
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 24 గంటల నల్లా నీళ్లు అందేలా స్కీం ఏర్పాటు చేస్తున్నామన్నారు. గంగుల కమలాకర్ నేతృత్వంలో కరీంనగర్ పట్టణం చాలా సుందరంగా మారిందన్నారు. ఇప్పుడు కరీంనగర్ ను నగరం అని పిలవాలని అనిపిస్తోందన్నారు. గంగుల కమలాకర్ చాలా మొండి మనిషి, ఆయన పట్టిన పట్టు అసలు విడవడన్నారు. అందుకే ఆ మానేరు రివర్ పంట్ర్ కట్టిస్తున్నాడు.