Telugu News » Group-2 : దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం!

Group-2 : దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం!

భవిష్యత్ లో ఇది రిపీట్ కాకుండా పరీక్షల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సీఎస్ కు కేసీఆర్ సూచించినట్టు తెలిపారు కేటీఆర్.

by admin

– గ్రూప్-2 పరీక్ష రీ షెడ్యూల్
– అభ్యర్థుల డిమాండ్ తో దిగొచ్చిన సర్కార్
– పరీక్ష రీ షెడ్యూల్ చేయాలని..
– సీఎస్ ను ఆదేశించిన కేసీఆర్
– ట్విట్టర్ లో ప్రకటించిన మంత్రి కేటీఆర్

ఉత్కంఠగా ఎదురుచూస్తున్న గ్రూప్-2 (Group-2) పరీక్ష రీ షెడ్యూల్ పై బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు సీఎం కేసీఆర్ (CM KCR). ఈ మేరకు ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించారు మంత్రి కేటీఆర్ (KTR). లక్షలాది మంది అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు టీఎస్పీఎస్సీతో సంప్రదించాలని సీఎస్ (CS) కు సీఎం (CM) తెలిసినట్టు చెప్పారు.

High Tension At TSPSC Office

భవిష్యత్ లో ఇది రిపీట్ కాకుండా పరీక్షల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సీఎస్ కు కేసీఆర్ సూచించినట్టు తెలిపారు కేటీఆర్. ఈ నిర్ణయంతో అభ్యర్థులకు తగిన సమయం దొరుకుతుందని.. పరీక్షలకు సిద్ధం కావొచ్చని అన్నారు. రెండు రోజుల క్రితం టీఎస్పీఎస్సీని ముట్టడించారు అభ్యర్థులు. ఈ నెలలో గ్రూప్-2 సహా వేర్వేరు సిలబస్‌ తో కూడిన 21 పోటీ పరీక్షలు ఉన్నాయని.. పరీక్షను రీషెడ్యూల్ చేయాలని కోరారు. అయితే.. ఈ వ్యవహారంలోకి ప్రతిపక్షాలు ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితి మారింది.

గ్రూప్-2 పరీక్షను ఈనెల 29, 30 తేదీల్లో నిర్వహించాలని అంతా సిద్ధం చేసుకుంది టీఎస్పీఎస్సీ (TSPSC). కానీ, అభ్యర్థులకు తోడుగా ప్రతిపక్ష పార్టీలు రంగంలోకి దిగాయి. గ్రూప్- 2 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం గన్ పార్క్ వద్ద దీక్షకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమైన పోలీసులు.. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం (Kodandaram) ను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించారు. పరీక్ష వాయిదా వేయాల్సిందేనని కోదండరాం డిమాండ్ చేశారు.

ఇటు బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ని కూడా గృహ నిర్బంధం చేశారు. ఆర్టీసీ బిల్లు వ్యవహారంలో రాజ్ భవన్ ముట్టడికి కార్మికులను ముఖ్యమంత్రి పంపించారని.. గన్ పార్క్ వద్ద శాంతియుతంగా ధర్నా చేపడుతుంటే ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదని ఆర్ఎస్ ధ్వజమెత్తారు. రాజ్ భవన్ వద్ద ఒక రూల్.. ఇక్కడ ఒక రూలా..? అని నిలదీశారు. సాయంత్రం 4 గంటలకు ఆయన సత్యాగ్రహ దీక్షను ముగించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పోలీసులను నమ్ముకొని తెలంగాణను జైలులా మార్చారని ఆరోపించారు. సీఎంను కూడా ఫాంహౌస్‌ లో నిర్బంధించే రోజులు దగ్గర పడ్డాయన్నారు. గ్రూప్-2 వాయిదా వేయడం లేదంటే పోస్టులన్నీ కల్వకుంట్ల కుటుంబం అమ్ముకుందని నిరుద్యోగులు అనుకుంటున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో పరీక్ష రీషెడ్యూల్ కు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

You may also like

Leave a Comment