Telugu News » Chandrasekhar : బీజేపీకి చంద్రశేఖర్ రాజీనామా.. ముందే చెప్పిన ‘రాష్ట్ర’ !

Chandrasekhar : బీజేపీకి చంద్రశేఖర్ రాజీనామా.. ముందే చెప్పిన ‘రాష్ట్ర’ !

ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ సర్కార్ అన్నీ తెలిసి తెలంగాణ ప్రభుత్వానికి వత్తాసు పలకడం ప్రజా కంటకంగా మారింది.

by umakanth rao
Chandrasekhar met dk Sivakumar

మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్ (Chandrasekhar) బీజేపీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.ఈ మేరకు ఆయన టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి లేఖ రాశారు. 30 సంవత్సరాల తన రాజకీయ ప్రస్థానంలో ప్రజల మేలు కోసం, వారి అభీష్టం మేరకే రాజకీయాల్లో ఉంటున్నానని ఆయన పేర్కొన్నారు. ’12 మందితో హస్తం గూటికి’ అని చంద్రశేఖర్ భవిష్యత్ కార్యాచరణపై ‘రాష్ట్ర’ ముందే ప్రకటించింది. అదే నిజమైంది. తెలంగాణ ప్రజల చిరకాల కోరికైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో 12 సంవత్సరాలు పని చేసి ఆ క్రమంలో మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని ఆయన తన లేఖలో అన్నారు.

Chandrasekhar: మాజీమంత్రి చంద్రశేఖర్‌ ఇంట్లో తెలంగాణ ఉద్యమకారుల భేటీ | Telangana Activists Meet at EX-Minister Chandrasekhar's House

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ రాష్ట్ర యువతకు ఉద్యోగాలు, రైతుల పొలాలకు నీళ్లు వస్తాయని భావిస్తే అధి కల గానే మిగిలిపోయిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP) ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వాన్ని నివారించి తెలంగాణకు న్యాయం చేస్తుందని భావించి అనేకమంది ఉద్యమనాయకులు బీజేపీలో చేరి భంగపాటుకు గురవుతున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ బీజేపీ సర్కార్ అన్నీ తెలిసి కూడా తెలంగాణ ప్రభుత్వానికి వత్తాసు పలకడం ప్రజా కంటకంగా మారిందని ఆయన ఆరోపించారు.

Ex-Minister Chandrashekhar Resigns To BJP

ఈ పరిస్థితుల్లో తప్పనిసరై రాజీనామా చేస్తున్నానని, మూడు సంవత్సరాల పాటు నాకు సహకరించి నాతో బాటు పని చేసిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలని చంద్రశేఖర్ తన లేఖలో పేర్కొన్నారు. పార్టీకి పని చేసే నాయకులను ప్రోత్సహించకపోవడం శోచనీయమన్నారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ అన్యాయాలను నిలువరించలేకపోతోందని ఆయన అన్నారు. ఈ నెల 18 న చంద్రశేఖర్ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే ఆయన ఈ పార్టీ పెద్దలతో మంతనాలు జరిపారు. 12 మందితో హస్తం గూటికి చంద్రశేఖర్ అని, ‘రాష్ట్ర’ ఎక్స్ క్లూజివ్ గా ఇటీవలే వార్త ప్రకటించింది. సైలెంట్ గా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే. శివకుమార్ తో ఆయన భేటీ అయ్యారని కూడా స్పష్టం చేసింది.

You may also like

Leave a Comment