Telugu News » Stadium collapsing : కూలిన ఇండోర్ స్టేడియం.. ఇద్దరు కార్మికులు మృతి..!!

Stadium collapsing : కూలిన ఇండోర్ స్టేడియం.. ఇద్దరు కార్మికులు మృతి..!!

కూలిన శిథిలాలను పూర్తిగా తొలిగిస్తే కానీ మృతుల సంఖ్య పై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు పోలీసులు తెలుపుచున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

by Venu

రంగారెడ్డి (Rangareddy) జిల్లా మెయినాబాద్ (Meinabad) మండలం కనకమామిడిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం (Indoor Stadium) ఒక్కసారిగా కూప్పకూలడంతో అక్కడ పని చేస్తున్న ఇద్దరు కార్మికులు మరణించగా.. మరికొంత మంది కార్మికులు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.. టేబుల్ టెన్నిస్ అకాడమికి చెందిన ఇండోర్ స్టేడియంలో నిర్మాణ పనులు చేస్తుండగా.. స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయినట్టు స్థానికులు వెల్లడించారు.

మరోవైపు ప్రమాదం జరిగిన సమయంలో దాదాపుగా 14 మంది కూలీలు ఉన్నట్టు సమాచారం.. వారిలో ఇద్దరు కార్మికులు మృత్యువాతపడగా.. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్టు స్థానిక సమాచారం.. కాగా మరణించిన కూలీలు.. బీహార్ కు చెందిన బబ్లు, వెస్ట్ బెంగాల్‌కు చెందిన సునీల్‌గా గుర్తించారు. ప్రమాద ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

కూలిన శిథిలాలను పూర్తిగా తొలిగిస్తే కానీ మృతుల సంఖ్య పై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు పోలీసులు తెలుపుచున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు ఈ ప్రమాదానికి గల కారణాలు కూడ తెలియాల్సి ఉంది. ఇక నిర్మాణంలో నాణ్యత లేకపోవటం వల్ల స్టేడియం కూలిందా ? లేక డిజైన్ లోపమా? అనేది తేలవలసి ఉంది. విచారణ తర్వాత పూర్తి వివరాలు బయటకు వస్తాయని అధికారులు వెల్లడించారు..

You may also like

Leave a Comment