Telugu News » Kishan Reddy : కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఏకమవుతున్నారు…!

Kishan Reddy : కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఏకమవుతున్నారు…!

తన కుమారుడు సీఎం అవుతారని కేసీఆర్ కలలు కంటున్నారని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు. అబద్దాలు చెప్పడం కేసీఆర్ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు.

by Ramu

బీసీ (BC)ని సీఎం (CM) చేస్తామని ప్రకటించే దమ్ము కాంగ్రెస్‌‌ (Congress)కు ఉందా అని బీజేపీ తెలంగాణ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రశ్నించారు. తన కుమారుడు సీఎం అవుతారని కేసీఆర్ కలలు కంటున్నారని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు. అబద్దాలు చెప్పడం కేసీఆర్ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే 2104 హామీకి కట్టుబడి ఇప్పటికైనా దళితున్ని సీఎం చేస్తుందా అని ప్రశ్నించారు.

తెలంగాణ అభివృద్ది చెందాలంటే ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు. బీజేపీకి ప్రజలు అవకాశం ఇస్తారని తాను భావిస్తున్నట్టు చెప్పారు. రీజినల్‌ రింగ్ రోడ్డు ఎందుకు ఆలస్యమవుతుందో సీఎం కేసీఆరే చెప్పాలన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఏకమవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీకి ప్రజాదరణ పెరుగుతోందన్నారు.

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తామన్నారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ లు రాష్ట్రానికి వచ్చి ప్రచారం నిర్వహిస్తారన్నారు. రాష్ట్రంలో మూడు రోజుల పాటు ప్రధాని మోడీ ప్రచారం నిర్వహిస్తారని అన్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో తుప్రాన్, నిర్మల్, కామారెడ్డి, మహేశ్వరం, కరీంనగర్, మహబూబ్ బాద్ జిల్లాల్లో బహిరంగ సభల్లో మోడీ పాల్గొంటారన్నారు.

బీసీ వర్గాల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్​ఎస్​ సర్కార్ పని చేస్తోందని ఆరోపణలు గుప్పించారు. తమ పార్టీకి బీసీ సంఘాలు మద్దతు ఇస్తున్నాయన్నారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పని చేయడం లేదన్నారు. ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా దోచుకుందని నిప్పులు చెరిగారు. కర్ణాటక తర్వాత తెలంగాణలో గెలుస్తామని కలలు కంటోందని ఎద్దేవా చేశారు.

You may also like

Leave a Comment