Telugu News » BRS : తెలంగాణలో హ్యాట్రిక్ సాధించనున్న బీఆర్ఎస్.. ఎన్నికల నివేదిక వైరల్.. !

BRS : తెలంగాణలో హ్యాట్రిక్ సాధించనున్న బీఆర్ఎస్.. ఎన్నికల నివేదిక వైరల్.. !

తెలంగాణలో అధికార బీఆర్ఎస్ (BRS) మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టొచ్చని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. హంగ్ కి ఏమాత్రం ఛాన్స్ లేదని స్పష్టం చేస్తున్నాయి.. నవంబర్ 16 నుండి 21 వరకు వివిధ కోణాల్లో నిర్వహించిన ఈ సర్వేలో జనం బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నట్టు తేలిందని అంటున్నారు..

by Venu
cm kcr

ఎన్నికల్లో విజయాన్ని సాధించడానికి ప్రధాన పార్టీలు తమ శక్తి మేరకు కృషి చేస్తున్నాయి.. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల పోరు ఉత్కంఠంగా మారింది. ఇప్పటికే విజయం తమదంటే తమదని పార్టీలు ధీమాగా ఉన్నాయి.. వివిధ సర్వేలు కూడా తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ ఎన్నికల పోరును మరింత ఆసక్తిగా మారుస్తున్నాయి.. ఈ సమయలో తాజాగా న్యూస్ టాప్ (News Top) తెలంగాణ స్టేట్ సర్వే నివేదిక తెరపైకి వచ్చింది.

తెలంగాణలో అధికార బీఆర్ఎస్ (BRS) మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టొచ్చని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. హంగ్ కి ఏమాత్రం ఛాన్స్ లేదని స్పష్టం చేస్తున్నాయి.. నవంబర్ 16 నుండి 21 వరకు వివిధ కోణాల్లో నిర్వహించిన ఈ సర్వేలో జనం బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నట్టు తేలిందని అంటున్నారు.. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ నవంబర్ 15 చివరి తేదీ కాబట్టి ఈ సర్వేని నవంబర్ 16న ప్రారంభించినట్లు చెబుతున్నారు.

ప్రధానంగా యువత, విద్యార్థులతో పాటు డబుల్ బెడ్‌ రూం పథకాల నుండి ప్రయోజనం పొందని వర్గంతో కాస్త సమస్యని ఈ సర్వేలో తేలిందని చెబుతుంది. ఫలితంగా 2018 ఎన్నికలలో 88 స్థానాలు సాధించిన బీఆర్ఎస్… 2023 ఎన్నికల్లో 65-76 స్థానాలకు పడిపోవచ్చని చెబుతుంది. మరోపక్క కాంగ్రెస్ (Congress) పార్టీ బీఆర్ఎస్ గురించి ప్రతికూల కథనాలను రూపొందించడానికి ప్రయత్నించినప్పటికీ, అవి ఫలించవని సర్వే సంస్థ వెల్లడించింది.

మరోవైపు బీఆర్ఎస్ తర్వాత స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలిచినట్టు తెలుపుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వెనబడనికి కారణాన్ని కూడా సర్వే సంస్థ వెల్లడించింది. రాష్ట్రంలో స్పష్టమైన నాయకత్వం లేకపోవడం వల్ల కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం అస్థిరంగా ఉంటుందని.. ఫలితంగా చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించే అవకాశం ఉందనే గందరగోళం ప్రజల్లో నెలకొందని ఈ సర్వే ద్వారా తేటతెల్లమైనట్టు చెబుతుంది. ఇక ఈ ఎన్నికల్లో సుమారు 11 స్థానాల్లో టఫ్ ఫైట్ జరగొచ్చని ఫలితాలు చెబుతున్నాయి. వీటిలో కొన్ని బీఆర్ఎస్ కు మరికొన్ని కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు రావడం కన్ ఫాం అయినప్పటికీ… ఫైట్ మాత్రం హోరా హోరీగా ఉంటుందని సర్వే సంస్థ వెల్లడిస్తుంది.

You may also like

Leave a Comment