Telugu News » Mlc Kavitha: ప్రశ్నించడం మన రక్తంలోనే ఉంది: ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha: ప్రశ్నించడం మన రక్తంలోనే ఉంది: ఎమ్మెల్సీ కవిత

రాబోయే యుగం యువతదేనని కవిత తెలిపారు. ప్రజా స్వామ్యంలో ఓటు అత్యంత శక్తి మంతమైందన్నారు. ఓటు వేయకపోతే అడిగే హక్కును కోల్పోతారని అన్నారు. పట్టణాల్లో తక్కువగా పోలింగ్ అవుతోందని గ్రామాల్లో ఓటింగ్ పెరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

by Mano
Mlc Kavitha: Questioning is in our blood: Mlc Kavitha

ప్రశ్నించడం తెలంగాణ రక్తంలోనే ఉందని ఎమ్మెల్సీ కవిత(Mlc Kavitha) అన్నారు. నిజామాబాద్ జిల్లా(Nijamabad Dist) విద్యార్థులు, కొత్త ఓటర్లతో ఇంటరాక్షన్‌లో ఆమె పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రశ్నించడం తెలంగాణ రక్తంలో ఉందని కవిత వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా ద్వారా తమ సమస్యలను ప్రశ్నించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

Mlc Kavitha: Questioning is in our blood: Mlc Kavitha

రాబోయే యుగం యువతదేనని కవిత తెలిపారు. ప్రజా స్వామ్యంలో ఓటు అత్యంత శక్తి మంతమైందన్నారు. ఓటు వేయకపోతే అడిగే హక్కును కోల్పోతారని అన్నారు. పట్టణాల్లో తక్కువగా పోలింగ్ అవుతోందని గ్రామాల్లో ఓటింగ్ పెరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలు అంటే ఆషామాశిగా తీసుకోవద్దని సూచించారు. తప్పుడు ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే, దేశ యువతకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు.

సైనికులు బార్డర్‌లో యుద్ధం చేస్తున్నారు. యువత ఇక్కడ నిలబడి ఓటు వేయలేరా? అని కవిత ప్రశ్నించారు. దేశం అభివృద్ధి జరగాలంటే యువత ఓటింగ్ లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మన ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉంటే దేశం అంత బలంగా మారుతుందని అన్నారు. మహిళలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని కవిత చెప్పుకొచ్చారు.

ఎన్నికలు అనగానే ఒక బ్రహ్మ పదార్థం, మాకు సంబంధం లేదు అనే ఆలోచన నుంచి విద్యార్థులు బయటకు రావాలన్నారు. దేశానికి వ్యాపారం పేరుతో వచ్చిన ఆంగ్లేయులు దేశ ప్రజల స్వేచ్ఛను హరించారని తెలిపారు. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం ఇండియా అని తెలిపారు. యువత తమ వాయిస్‌ను వినిపించేందుకు సోషల్ మీడియాను వినియోగించుకోవాలన్నారు.

You may also like

Leave a Comment