Telugu News » Revanth: కేసీఆర్, మోడీ బంధం ఇప్పటిది కాదు.. రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

Revanth: కేసీఆర్, మోడీ బంధం ఇప్పటిది కాదు.. రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

నవంబర్ 15వ తేదీలోపే రైతులకు రైతు బంధు డబ్బులు వేయాలని డిమాండ్ చేసినా పట్టించుకోని కేంద్రం.. ఎన్నికల సంఘం.. ఇప్పుడు ఎలా ఆదేశాలు ఇస్తుందని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్(Kcr), ప్రధాని మోడీ(Modi) పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

by Mano
revanth reddy sudden tour to bengaluru

సీఎం కేసీఆర్, ప్రధాని మోడీల అనుబంధం ఇప్పటిది కాదని, 2018 ఎన్నికల్లోనే మొదలైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్(Kcr), ప్రధాని మోడీ(Modi) పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు పైసలు పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు ఎలా జమ చేస్తారని ప్రశ్నించారు.

revanth reddy sudden tour to bengaluru

 

నవంబర్ 15వ తేదీలోపే రైతులకు రైతు బంధు డబ్బులు వేయాలని డిమాండ్ చేసినా పట్టించుకోని కేంద్రం.. ఎన్నికల సంఘం.. ఇప్పుడు ఎలా ఆదేశాలు ఇస్తుందని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు రైతు డబ్బులు వేస్తున్నారంటనే, కేంద్రం అనుమతి వచ్చింది అంటేనే అర్థం అవుతుందని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటే అని రేవంత్ ఆరోపించారు. దీని వల్ల ఒక్కో రైతు రూ.5వేల రూపాయల వరకు నష్టపోతున్నాడని తెలిపారు.

రైతులు ‘రైతు బంధు’ డబ్బులు తీసుకోవాలని సూచించిన రేవంత్.. ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకే వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎకరానికి రూ.15వేలు వేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్, మోడీ బంధం ఇప్పటిది కాదన్న రేవంత్.. 2018 ఎన్నికల్లోనూ ఇదే తరహాలో పోలింగ్‌కు ముందు రైతుబంధు నిధులు విడుదల చేశారని గుర్తుచేశారు. అప్పటి నుంచే కేసీఆర్, మోడీ బంధం బలంగా ఉందని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీకి.. బీజేపీ సంపూర్ణ సహకారం అందిస్తుందని రేవంత్ చెప్పారు. ఈ పరిణామాలపై నిజానిజాలు తెలుసుకుని, కేసీఆర్ కుట్రలు గమనించి ప్రజలు విచక్షణతో.. విజ్ఞతతో ఓటు వేయాలని కోరారు. రాముడి లాంటి వివేక్‌పై ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారని రేవంత్ అన్నారు. బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరగానే వివేక్ రావణాసురుడులాగా కనిపించాడా? అని మండిపడ్డారు.

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి బంధువైన పాపానికి రఘురాంరెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని రేవంత్ అన్నారు. మాజీ ఏఐఎస్ అధికారి, బీఆర్ఎస్ పార్టీ సలహాదారుడు అయిన ఏకే గోయల్ ఇంట్లో 300కోట్లు ఉన్నాయని తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ ఓటుకు రూ.10వేలు ఎమ్మెల్యే అభ్యర్థులకు పంపారని, తక్కువ ఇస్తే అభ్యర్థులను నిలదీయాలని రేవంత్ ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్, బీజేపీతో పోటీ కాదని, ఈడీ,ఐటీనే పోటీ అని రేవంత్ అన్నారు. డిసెంబర్ 3న ఈడీ.. ఐటీని ఒడిస్తామని వెల్లడించారు.

You may also like

Leave a Comment