Telugu News » Telangana Elections: ఖరీదుగా మారిన తెలంగాణ ఎన్నికలు.. ఈసారి ఖర్చు ఎంత అంటే..?

Telangana Elections: ఖరీదుగా మారిన తెలంగాణ ఎన్నికలు.. ఈసారి ఖర్చు ఎంత అంటే..?

తెలంగాణ దంగల్‌లో ధన ప్రవాహమే దీనికి సాక్ష్యమని విశ్లేషకులు వివరిస్తున్నారు. హుజురాబాద్‌ (Huzurabad) ఉప ఎన్నికలో 700 కోట్ల రూపాయలు దాటి ఖర్చు పెట్టారని ప్రచారం.. తర్వాత వచ్చిన మునుగోడు (Munugodu)ఉప ఎన్నికలో కూడా 600 కోట్ల దాకా అభ్యర్థులు ఖర్చు పెట్టినట్టు వార్తలు వచ్చాయి.

by Venu

నేటి రాజకీయాలు అంగట్లో సరకుల్లా మారిపోయాయని అంటున్నారు. ఎంత పెట్టుబడి పెట్టాం.. ఎంత రాబట్టుకున్నాం.. అనే లెక్కన రాజకీయాలు మారిపోవడం ఆందోళనకు గురిచేస్తున్న అంశం అని సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.. ఒకప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలంటే.. అభ్యర్థి క్యారెక్టర్ చూసేవారు.. కాని ఇప్పుడు క్యారెక్టర్ లేకున్నా కాసులుంటే చాలంటున్నారు.. నేటి రాజకీయాల్లో అభ్యర్థి ఎంత పెట్టుబడి పెడితే అంతా రాబట్టుకోవచ్చనే అభిప్రాయం జనంలో ఉందని అనుకుంటున్నారు.

మరోవైపు తెలంగాణ (Telangana)లో ఎన్నికలు అంటే ఖర్చు వేళ కోట్ల వరకు వెళ్ళడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని సామాజికవేత్తలు (Sociologists) అంటున్నారు. తెలంగాణ దంగల్‌లో ధన ప్రవాహమే దీనికి సాక్ష్యమని విశ్లేషకులు వివరిస్తున్నారు. హుజురాబాద్‌ (Huzurabad) ఉప ఎన్నికలో 700 కోట్ల రూపాయలు దాటి ఖర్చు పెట్టారని ప్రచారం.. తర్వాత వచ్చిన మునుగోడు (Munugodu)ఉప ఎన్నికలో కూడా 600 కోట్ల దాకా అభ్యర్థులు ఖర్చు పెట్టినట్టు వార్తలు వచ్చాయి.

ఇక మునుగోడు ఎన్నికల్లో ఖర్చు గురించి ఏకంగా దేశమే మాట్లాడుకుంది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా రికార్డు సృష్టించబోతున్నాయని విశ్లేషకులు అంచనవేస్తున్నారు.. ఈసారి 15 వేల కోట్ల నుంచి 20 వేల కోట్ల రూపాయల దాకా ఖర్చవుతుందని అంచనకు వస్తున్నారు.. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. 709 కోట్ల రూపాయలకు పైగా నగదు, నగలు ఇప్పటి వరకు పోలీసులు పట్టుకున్నారు.

ఇందులో 290 కోట్ల రూపాయల వరకు నగదు రూపంలోనే పట్టుబడటం ఆశ్చర్యం.. అనధికారికంగా ఇంకెంత ధనం ప్రవహించిందో చెప్పడం కష్టం అంటున్నారు విశ్లేషకులు. తమ స్థోమతను బట్టి ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి సుమారుగా 50 కోట్ల నుంచి 100 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్ ప్రతినిధి పద్మనాభ రెడ్డి.. ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయడంలో ఎలక్షన్‌ కమిషన్‌ పూర్తిగా విఫలం అయిందని అభిప్రాయపడ్డారు.. ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయకపోతే దేశాభివృద్ధికి ఆటంకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

You may also like

Leave a Comment