Telugu News » Telangana Elections-2023: ఓటు వేసిన సినీ ప్రముఖులు..!

Telangana Elections-2023: ఓటు వేసిన సినీ ప్రముఖులు..!

జూబ్లీహిల్స్‌లోని క్లబ్ పోలింగ్ బూత్‌లో టాలీవుడ్ అగ్రహీరో, మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని స్టార్‌ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

by Mano
Telangana Elections-2023: Film celebrities who voted..!

తెలంగాణ(Telangana) రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Assembly Election Polling) షురూ అయింది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు(Celebrities) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Telangana Elections-2023: Film celebrities who voted..!

జూబ్లీహిల్స్‌లోని క్లబ్ పోలింగ్ బూత్‌లో టాలీవుడ్ అగ్రహీరో, మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని స్టార్‌ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఎస్ఎన్ఎల్ సెంటర్ పోలింగ్ బూత్‌ 153లో ఆయన ఓటు వేశారు.

Telangana Elections-2023: Film celebrities who voted..!

మణికొండలో హీరో విక్టరీ వెంకటేశ్ ఓటు వేశారు. అదేవిధంగా జూబ్లీ హిల్స్‌ ఓబుల్ రెడ్డి స్కూల్‌లో జూనియర్ ఎన్టీఆర్ తన సతీమణి ప్రణతితో కలిసి ఓటు వేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం. కీరవాణి జూబ్లిహిల్స్‌లో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు.

ఎస్ఆర్ నగర్‌లో ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, తేజ ఓటు వేశారు. జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో నటుడు సుమంత్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

You may also like

Leave a Comment