Telugu News » Nagarjuna Sagar : కీలక మలుపు తీసుకున్న జల వివాదం.. సుప్రీం కోర్టులో విచారణ వాయిదా..!!

Nagarjuna Sagar : కీలక మలుపు తీసుకున్న జల వివాదం.. సుప్రీం కోర్టులో విచారణ వాయిదా..!!

కౌంటర్ దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని కేంద్ర జలశక్తి శాఖ సుప్రీంకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జల వివాదానికి సంబంధించిన కేసు విచారణ జనవరి 12కు వాయిదా పడింది. మరోవైపు ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను పంపిణీ చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది.

by Venu

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రెండు రోజులుగా సాగుతున్న జల వివాదం (Water Dispute) కీలక మలుపు తీసుకుంది. నాగార్జున సాగర్​ (Nagarjuna Sagar) కుడి కాలువ నుంచి నీటి తరలింపును నిలిపివేయాలని ఏపీ (AP)ని కృష్ణా బోర్డు (Krishna Board) ఆదేశించింది. ఇప్పటికే కేటాయింపులకు మించి నీటిని తరలించుకుపోయారని, వెంటనే తరలింపు నిలిపివేయాలని సూచించింది.

మరోవైపు నవంబర్ 30 తర్వాత ఏపీ నుంచి నీటి కోసం ఎలాంటి వినతి రాలేదని కృష్ణా బోర్డు తెలిపింది. అక్టోబర్ కోసం అడిగిన 5 టీఎంసీల్లో ఇప్పటికే 5.01 టీఎంసీలు విడుదల చేసినట్టు పేర్కొంది.. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాల వినియోగం విషయంలో దాఖలు చేసిన పిటిషన్‌ పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

ఈ సందర్భంగా కౌంటర్ దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని కేంద్ర జలశక్తి శాఖ సుప్రీంకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జల వివాదానికి సంబంధించిన కేసు విచారణ జనవరి 12కు వాయిదా పడింది. మరోవైపు ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను పంపిణీ చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది.

ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్‌కు నూతన విధివిధానాలు ఇవ్వడాన్ని సవాల్ చేసింది. ఈ మేరకు ఈ పిటిషన్‌పై గత విచారణలో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు, కేంద్రాన్ని ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని కేంద్ర జలశక్తి శాఖ కోరడంతో సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది..

 

 

You may also like

Leave a Comment