Telugu News » TS Election Counting: తెలంగాణ ఎన్నికల్లో తొలి రిజల్ట్ వచ్చేది అక్కడే…!

TS Election Counting: తెలంగాణ ఎన్నికల్లో తొలి రిజల్ట్ వచ్చేది అక్కడే…!

తెలంగాణ రాష్ట్రంలోని 35,655 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. అతి తక్కువ పోలింగ్ కేంద్రాలున్న భద్రాచలంలో 13, అశ్వారావుపేటలో 14, చార్మినార్‌లో 15, ఆర్మూర్‌లో 16 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు కంప్లీట్ అవుతుంది.

by Mano
TS Election Counting: The first result of Telangana election will be there...!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Elections) ఓట్ల లెక్కింపునకు (Counting) సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గానూ కాసేపట్లో ఓట్ల లెక్కింపు స్టార్ట్ కానుంది. ఇక, ఓట్ల లెక్కింపునకు 49 ప్రాంతాల్లో 119 కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 1,798 టేబుళ్లలో 2,417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగనుంది.

TS Election Counting: The first result of Telangana election will be there...!

తెలంగాణ రాష్ట్రంలోని 35,655 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు పూర్తయ్యాక ఉదయం 8.30 నుంచి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. పది గంటల నుంచి ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తుంది.

ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు కేంద్ర సర్వీసుల్లో ఎంప్లయిస్, దివ్యాంగులు, వయోవృద్ధులు సుమారు 2.20 లక్షల మంది వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అతి తక్కువ పోలింగ్ కేంద్రాలున్న భద్రాచలంలో 13, అశ్వారావుపేటలో 14, చార్మినార్‌లో 15, ఆర్మూర్‌లో 16 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు కంప్లీట్ అవుతుంది.

అదేవిధంగా ఎక్కువ పోలింగ్ కేంద్రాలున్న శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఎల్బీనగర్, మేడ్చల్ నియోజకవర్గాల్లో ఫలితాలు ఆలస్యమవుతాయి. ఆయా చోట్ల 500 నుంచి 600 వరకు పోలింగ్ కేంద్రాలు ఉండటంతో వాటిని లెక్కించడానికి చాలా సమయం పడుతుంది. తెలంగాణలో అతి తక్కువ ఓటర్లు, తక్కువ పోలింగ్ కేంద్రాలున్న చార్మినార్, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల ఫలితాలు తొలుత వెలువడే చాన్స్ ఉంది.

You may also like

Leave a Comment