Telugu News » Yuvagalam: ముగియనున్న ‘యువగళం’.. టీడీపీ, జనసేన భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు..!

Yuvagalam: ముగియనున్న ‘యువగళం’.. టీడీపీ, జనసేన భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు..!

వైఎస్సార్సీపీ(YSRCP) తో పాటు టీడీపీ(TDP), జనసేన(Janasena)లు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రచార కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూల్‌ను ప్రిపేర్ చేసుకుంటున్నాయి.

by Mano
Assembly Results: Congress is strong in Telangana.. big victory in two places..!

ఏపీ(AP) అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మార్చి మొదటి వారంలోనే వచ్చే అవకాశం ఉంది. ఇంకా మూడు నెలలు మాత్రమే ఉండడంతో ఏపీలో రాజకీయం వేడెక్కనుంది. ఇందుకు ఇప్పటి నుంచే అధికార వైఎస్సార్సీపీ(YSRCP) తో పాటు టీడీపీ(TDP), జనసేన(Janasena)లు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రచార కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూల్‌ను ప్రిపేర్ చేసుకుంటున్నాయి.

Assembly Results: Congress is strong in Telangana.. big victory in two places..!

ఎన్నికల ప్రచారానికి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన చేపట్టిన యువగళం పాదయాత్రను 17వ తేదీన భీమిలిలో ముగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారు.

జనసేనతో కలిసినందున ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ చేస్తామన్న నమ్మకంతో ఆ రెండు పార్టీలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగా పాదయాత్ర రేంజ్ ఉండాలని డిసైడయ్యారు. ముందుగా అనుకున్న ప్రకారం శ్రీకాకుళం వరకూ పాదయాత్ర చేస్తే మరో పదిహేను రోజులు పడుతుంది. కానీ ఎన్నికల సన్నాహాలకు సమయం సరిపోదు కాబట్టి లోకేష్ భీమిలీతో ముగించాలనుకుంటున్నారు.

యువగళం పాదయాత్ర ముగింపు సభకు చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ హాజరవుతారు. జనసేన, టీడీపీ అగ్రనేతలు పాల్గొనే మొదటి ఉమ్మడి సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.భారీ జనసమీకరణతో ఉత్తరాంధ్రలో బలాన్ని చాటేలా ఈ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రుషికొండ ఐటీ సెజ్‌కు ఆనుకుని ఎస్‌సీసీకి ఇచ్చిన భూములు, కొమ్మాదిలోని ఓజోన్‌ వ్యాలీ, జిల్లా శివారు రాజాపులోవతో పాటు ఆనందపురం ప్రాంతాల్లో మరో రెండు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.

మరో వైపు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవల బాగా యాక్టివ్ అయ్యారు. ఆయనే విశాఖ జిల్లాలో లోకేష్ పాదయాత్ర విషయంలో బహిరంగసభ విషయంలో లీడ్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ నతలందరికీ ఉమ్మడి బాధ్యతలిచ్చినా గంటా మరింత చొరవ తీసుకుంటున్నారు.

You may also like

Leave a Comment