Telugu News » MP Aravind : లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ ఎందుకు కాలేదంటే..!!

MP Aravind : లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ ఎందుకు కాలేదంటే..!!

దొరల గడీల నుంచి తెలంగాణకి విముక్తి లభించిందని తెలిపిన అరవింద్.. రాష్ట్రంలో హుందాతనంతో కూడిన పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నట్టు వెల్లడించారు.. దాడుల సంస్కృతికి స్టాప్ పడుతుందని, భాష కూడా మారుతుందని భావిస్తున్నట్టు అరవింద్ తెలిపారు.

by Venu

తెలంగాణ (Telangana)లో బీఆర్ఎస్ ఓటమి పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు.. బీఆర్ఎస్ పార్టీ పతనం మొదలైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో బీఆర్ఎస్ పై అభిమానం తగ్గిపోయిందని తెలిపిన అరవింద్.. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా కూడా రావొద్దు అని కోరుకుంటున్నట్టు వెల్లడించారు.. బీఆర్ఎస్ నేతల అహంకార ధోరణి వల్లే ఆ పార్టీ ఓటమిని మూటగట్టుకుందని తెలిపారు.

If KCR dies we will give MP Aravind comment sparks row

రాష్ట్రంలో ఏడాది క్రితం వరకు బీఆర్ఎస్ (BRS)కు బీజేపీ (BJP) ప్రత్యామ్నాయం అనే భావన ఉండేదని, కానీ బీజేపీ ఆ నమ్మకాన్ని కోల్పోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు అరవింద్.. పార్టీ వైఫల్యం విషయంలో బీజేపీ అధిష్టానం లోటుపాట్లు పరిశీలించి, చర్చ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక కేసీఆర్ (KCR) శకం ముగిసిందని, అందుకు సగం సంతోషంగా ఉందని అరవింద్ వెల్లడించారు.

దొరల గడీల నుంచి తెలంగాణకి విముక్తి లభించిందని తెలిపిన అరవింద్.. రాష్ట్రంలో హుందాతనంతో కూడిన పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నట్టు వెల్లడించారు.. దాడుల సంస్కృతికి స్టాప్ పడుతుందని, భాష కూడా మారుతుందని భావిస్తున్నట్టు అరవింద్ తెలిపారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ జీరో స్థాయిలో ఉండేదని.. పీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డికి ఇచ్చాక కూడా కాంగ్రెస్ గెలుస్తుందనే నమ్మకం లేని పరిస్థితి నుంచి ఈ స్థాయికి చేరుకోవడం వెనక రేవంత్ కృషి ఎంతో ఉందని అరవింద్ (Aravind) తెలిపారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనన్న ఆరోపణ నిజం అని నమ్మి.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కాకపోవడం వెనక బీజేపీ ఉందనే భావనతోనే ప్రజలు కాంగ్రెస్ పై ఆసక్తి చూపినట్టు అరవింద్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని తెలిపారు.. బీఆర్ఎస్ బాల్కొండలో రూ.34 కోట్లు పంచిందని ఆరోపించిన అరవింద్.. బీఆర్ఎస్ పార్టీ పతనానికి ఇది ఆరంభం మాత్రమే అని విమర్శించారు..

You may also like

Leave a Comment