Telugu News » Congress : కీలక నిర్ణయాలు తీసుకోనున్న కొత్త ప్రభుత్వం.. జీహెచ్​ఎంసీకి కొత్త బాసులు..!!

Congress : కీలక నిర్ణయాలు తీసుకోనున్న కొత్త ప్రభుత్వం.. జీహెచ్​ఎంసీకి కొత్త బాసులు..!!

జలమండలి ఎండీగా దానకిషోర్‌ బాధ్యతలు చేపట్టి ఆరేళ్లు దాటింది. ఈ క్రమంలో ఇక్కడి నుంచి బదిలీ చేసి కీలక విభాగాల్లో సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఎన్నికల ముందే జీహెచ్​ఎంసీ కమిషనర్‌గా రోనాల్డ్‌ రాస్‌ బాధ్యతలు చేపట్టడంతో ఆయన్నే కొనసాగిస్తారా లేదా అనేది కొద్దిరోజుల్లో స్పష్టత రానున్నట్టు తెలుస్తుంది.

by Venu

తెలంగాణ (Telangana)లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు వేగవంతం అయ్యింది. ఈ రెండు రోజుల్లో సీఎం ఎవరనేది క్లారిటీ రానుందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్ (Hyderabad) పరిపాలనలో కీలకమైన విభాగాల్లో మార్పులు చేర్పులు జరగనున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) ఏర్పాటు తర్వాత ప్రస్తుతం ఉన్న సిబ్బందికి స్థానచలనం జరిగే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే ఇప్పటి వరకు హెచ్‌ఎండీఏ (HMDA)కు పూర్తిస్థాయి కమిషనర్‌ లేకపోవడంతో సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతుందనే టాక్ ఉంది. పూర్తిస్థాయి కమిషనర్‌ లేకపోవడంతో కొన్నాళ్లుగా హెచ్‌ఎండీఏలో పాలన గాడి తప్పిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రానున్న దృష్ట్యా హెచ్‌ఎండీఏకు నూతన కమిషనర్‌ను నియమించే అవకాశం ఉంది.

మరోవైపు జలమండలి ఎండీగా దానకిషోర్‌ బాధ్యతలు చేపట్టి ఆరేళ్లు దాటింది. ఈ క్రమంలో ఇక్కడి నుంచి బదిలీ చేసి కీలక విభాగాల్లో సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఎన్నికల ముందే జీహెచ్​ఎంసీ కమిషనర్‌గా రోనాల్డ్‌ రాస్‌ బాధ్యతలు చేపట్టడంతో ఆయన్నే కొనసాగిస్తారా లేదా అనేది కొద్దిరోజుల్లో స్పష్టత రానున్నట్టు తెలుస్తుంది.

మరోవైపు ఎన్నికల సమయంలో సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్రపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఆయన బదిలీ కూడా ఉంటుందని సమాచారం. ఇక నగర కమిషనర్‌ సందీప్‌ శాండిల్య ఎన్నికల సమయంలో బాధ్యతలు తీసుకున్నారు. రాచకొండ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ (Rachakonda Cp Chauhan) కూడా ఏడాది కిందటే వచ్చారు. వీరిరువురిని కొనసాగిస్తారా? లేదా అనేది కొద్దిరోజుల్లో స్పష్టత రానుంది. అలాగే ఏడాది కిందట వచ్చిన నగర ట్రాఫిక్‌ విభాగం అదనపు కమిషనర్‌ సుధీర్‌బాబును కూడా బదిలీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం..

You may also like

Leave a Comment