తెలంగాణ (Telangana) ఉద్యమంలో వేపన్ లాగా ఉపయోగపడిన ప్రొఫెసర్ కోదండరాం.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయా వ్యూహాల వల్ల.. మరోవైపు బీఆర్ఎస్ అధిష్టానం లెక్కచేయక పోవడం వల్ల తగిన గుర్తింపు పొందలేకపోయారనే టాక్ ఉంది. ప్రొఫెసర్ కోదండరాం చేసిన త్యాగం నీటి మీది రాతలుగా మిగిలాయని అనుకున్నారు. అలా పది సంవత్సరాలుగా తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోకుండా తెర వెనక చేసిన ప్రయత్నాల ఫలితంగా ఈ రోజు కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిందని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా కోదండరాం తగిన గౌరవాన్ని పొందుతారా? అనే ప్రశ్న వినిపిస్తుంది. కాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంలో పలువురు మేధావులు, ప్రొఫెసర్లు చేసిన కృషి ఫలించింది. ఇందులో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కూడా ఉన్నారు. అవినీతిలో కూరుకు పోయి రాష్ట్రాన్ని నాశనం పట్టించిన కేసీఆర్ (KCR)ను ఓడించాల్సిందే అంటూ ప్రతి మీటింగ్ లో చెబుతూ వచ్చారు.
అదీగాక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి.. కాంగ్రెస్ కు పూర్తి మద్దతు కూడా ప్రకటించారు. టీజేఎస్ కార్యకర్తలు కాంగ్రెస్‌తో పనిచేయాలని సూచించారు. మొత్తానికి వీరి కృషి ఫలించి కాంగ్రెస్ మేజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో హస్తం హాయమంలో ప్రొఫెసర్ కోదండరాం (Professor Kodandaram)కు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఆయన్ను ఎమ్మెల్సీగా చేసి మంత్రిపదవి కూడా ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఉన్నత విద్యావంతుడైన కోందండరాంను శాసనమండలికి పంపి ఆయనకు విద్యాశాఖను కట్టబెట్టాలని కాంగ్రెస్ భావిస్తోందని పార్టీవర్గాల నుంచి సమాచారం.. ఒకవేళ ఆయన్ను మంత్రిగా చేయటం కుదరకపోతే.. కనీసం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా నియమించాలని కాంగ్రెస్ భావిస్తోందని టాక్ ఊపందుకుంది. మరోవైపు కోందండరాం ఒక ఉద్యమకారునిగా, విద్యావేత్తగా మిగిలిపోతాడా? లేక కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ కలలను నిజం చేయాడానికి కృషి చేస్తారా? అనేది ఇప్పుడు మేధావుల మనస్సులోని క్వచ్చన్..!