Telugu News » Gold Price: సామాన్యులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధరలు…!

Gold Price: సామాన్యులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధరలు…!

మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఈరోజు తులం బంగారంపై రూ.410 వరకు తగ్గింది. గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,450గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,670కి చేరింది.

by Mano
Gold Price: Good news for the common man.. Hugely reduced prices...!

బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు(Gold, Silver Prices) నిత్యం మారుతూ ఉంటాయి. మార్కెట్‌లో పసిడి ధరలు ఒక్కోసారి అమాంతం పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. వినియోగదారులు(Customers) బంగారం, వెండి ధరలవైపును గమనిస్తూ తగ్గినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొనడానికి ఆసక్తి చూపుతారు. అయితే మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.

Gold Price: Good news for the common man.. Hugely reduced prices...!

ఈరోజు తులం బంగారంపై రూ.410 వరకు తగ్గింది. గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,450గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,670కి చేరింది. ఇక ద్రవ్యోల్భణంతో పాటూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్ వడ్డీరేట్లలో వచ్చిన హెచ్చుతగ్గుల బంగారం ధరపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఇక వెండి ధర కూడా భారీగా తగ్గింది.. కిలో వెండిపై ఏకంగా రూ.300 వరకు తగ్గి రూ.81,000గా నమోదవుతోంది.

ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,600కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,820 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబయి, కోల్‌కతా, బెంగుళూరులో ఒకే ధరలు ఉన్నాయి. ఆయా నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,450 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 62,670 వద్ద కొనసాగుతోంది.

ఇక చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.58,150 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,440గా ఉంది. ఇక వెండి విషయానికొస్తే గురువాం ఢిల్లీ, ముంబయి, కోలకతాల్లో కిలో వెండి ధర రూ.78,200గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.81,000కి చేరింది. హైదరాబాద్‌లో కూడా అదే ధర కొనసాగుతోంది.

You may also like

Leave a Comment