Telugu News » Hanumantha Rao : కాంగ్రెస్ ప్రభుత్వానికి సీనియర్ నేత వార్నింగ్..?

Hanumantha Rao : కాంగ్రెస్ ప్రభుత్వానికి సీనియర్ నేత వార్నింగ్..?

రాష్ట్రంలో ఏర్పాటవుతున్న కొత్త సర్కార్‌లో తాను పెద్దన్న పాత్ర పోషిస్తానంటు హనుమంతరావు పేర్కొన్నారు.. ఆరు గ్యారంటీల అమలులో తేడాలు వస్తే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడారు వీహెచ్‌..

by Venu

తెలంగాణ (Telangana) రాజకీయాల్లో కీలక ఘట్టం కాంగ్రెస్ అధికారంలోకి రావడం అని అనుకుంటున్నారు జనం.. బీఆర్ఎస్ (BRS) పాలనలో విసిగిన ప్రజలు ప్రభుత్వాన్ని మార్చాలనే నిర్ణయంతో హస్తాన్ని అక్కున చేర్చుకున్నట్టు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు హామీలుగా ఇచ్చి ప్రజలను ఆకట్టుకుంది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ. హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో ఏర్పాటవుతున్న కొత్త సర్కార్‌లో తాను పెద్దన్న పాత్ర పోషిస్తానంటు హనుమంతరావు (Hanumantha Rao) పేర్కొన్నారు.. ఆరు గ్యారంటీల అమలులో తేడాలు వస్తే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడారు వీహెచ్‌.. అధిష్ఠానం మాటను ధిక్కరించే సంప్రదాయం కాంగ్రెస్‌ (Congress)లో లేదని స్పష్టం చేసిన హనుమంతరావు.. రేవంత్ రెడ్డి.. సోనియా గాంధీ నిర్ణయంతోనే ముఖ్యమంత్రి అయ్యారని స్పష్టం చేశారు.

తెలంగాణలో బెదిరింపులకు కాలం చెల్లిందన్న వీహెచ్.. దొరల గడీలు బద్దలు కొట్టి.. తెలంగాణ తల్లికి కాంగ్రెస్ విముక్తిని కలిగించిందని తెలిపారు.. ఈ అంశంలో రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) చేసిన కృషి కాంగ్రెస్‌ హైకమాండ్‌ గుర్తించిందని వి.హనుమంతరావు అన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించడానికి అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని తెలిపిన హనుమంతన్న.. మంత్రి వర్గ కూర్పు విషయంలో సామాజిక న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఇక రాష్ట్రంలో హస్తం జెండా రెపరేపలాడుతూ అధికారంలోకి వస్తుంది. నేడు ముఖ్య మంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.. ఈ క్రమంలో హస్తం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుని శభాష్ అనిపించుకుంటుందో.. లేక రాష్ట్రాన్ని అనిశ్చిత స్థితికి తీసుకువెళ్తుందో అనే అనుమానం ఈ సందర్భంగా కొందరిలో కలుగుతుంది.. ఇక ప్రతిపక్షాలు అయితే అవకాశం కోసం కాచుకున్నాయని ప్రచారం..

You may also like

Leave a Comment