Telugu News » Pragati Bhavan : దొరల గడీలు బద్దలు కొడుతున్న కొత్త ప్రభుత్వం..!!

Pragati Bhavan : దొరల గడీలు బద్దలు కొడుతున్న కొత్త ప్రభుత్వం..!!

బేగంపేట్ ప్రగతిభవన్ గేట్లను గ్యాస్ కట్టర్లు, జేసీబీలతో తొలగిస్తుండటంతో.. పోలీసులు భారీ సంఖ్యలో అక్కడి పరిస్థితిని సమీక్షిస్తూ.. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ప్రగతిభవన్ కంచెలను తొలగించి లారీలు, ట్రాక్టర్లల్లో తరలిస్తున్నారు.

by Venu

తెలంగాణ (Telangana)లో బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఘనంగా నిర్మించిన ప్రగతి భవన్ లో ఉన్న ప్రగతి ఒక్క కేసీఆర్ (KCR) కుంటుంబంలో మాత్రం జరిగిందనే ఆరోపణలు ఎన్నో వచ్చాయి. అదీగాక రాచరిక పాలనకు తెరతీసేలా ప్రగతి భవన్ ను సొంత ఆస్తిలా మార్చారని కేసీఆర్ పై విమర్శలు కూడా విరుచుకుపడ్డాయి. ఇక నిన్న మొన్నటి వరకూ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్నప్రగతి భవన్ వద్ద మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి.

మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) వచ్చాక ప్రగతి భవన్ (Pragati Bhavan)ను ప్రజా భవన్ గా మారుస్తామని రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ వద్ద బారికేడ్లను పోలీసులు తొలగిస్తున్నారు.ఇప్పటి వరకూ ప్రగతి భవన్ వద్ద అమలులో ఉన్న ట్రాఫిక్ ఆంక్షలను సైతం ఎత్తి వేశారు. కాగా ఇదివరకు ప్రగతి భవన్ వద్ద బారికేడ్లు రోడ్డులో సగభాగాన్ని ఆక్రమించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడేది. ఇప్పుడు ఆ అడ్డంకులు కూడా తొలగి పోతుండటంతో వాహన దారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఇక రేవంత్ సీఎం అయితే ప్రగతిభవన్ కంచెలు బద్దలు కొడతాను.. సామాన్యులకు ప్రవేశం కల్పిస్తానని పలుసార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రమాణ స్వీకారం కంటే ముందే.. ఈ పనిని పూర్తి చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అని అనుకుంటున్నారు. మరోవైపు బేగంపేట్ ప్రగతిభవన్ గేట్లను గ్యాస్ కట్టర్లు, జేసీబీలతో తొలగిస్తుండటంతో.. పోలీసులు భారీ సంఖ్యలో అక్కడి పరిస్థితిని సమీక్షిస్తూ.. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ప్రగతిభవన్ కంచెలను తొలగించి లారీలు, ట్రాక్టర్లల్లో తరలిస్తున్నారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న చర్యలతో.. దొరలు, తెలంగాణ తల్లికి వేసిన సంకెళ్ల నుంచి విముక్తి లభించిందని, రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులు, ఉద్యమకారులు అనుకుంటున్నారు.. కాంగ్రెస్ పాలనలో స్వేచ్ఛగా జీవించే వాతావరణం కలుగుతున్నందుకు ఆనందిస్తున్నారు..

You may also like

Leave a Comment