బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటి నుంచి మీడియా ముందుకు గులాబీ బాస్ రాలేదని జనం ముచ్చటించుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పాడైన సైలెన్సర్ లా విరామం లేకుండా అరచిన నోర్లు ఇప్పుడు ఏం మాట్లాడటం లేదనే ప్రశ్న జనం మనసుల్లో పుట్టినట్టు తెలుస్తుంది. ఎప్పుడు ఏదో విమర్శలతో సోషల్ మీడియాలో బిజీబిజీగా గడిపే బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం మూగనోము చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్ గాయాలతో హాస్పిటల్లో చేరడం చర్చగా మారింది.
కేసీఆర్ (KCR) విషయంలో గులాబీ నేతలు ఆందోళన పడుతున్న సమయంలో.. మరోనేత పోచారం శ్రీనివాసరెడ్డి యశోద హాస్పిటల్లో (Yashoda Hospital) వీల్ చైర్ లో ప్రత్యక్షం అవడం అభిమానులను షాక్ కు గురి చేసింది. పోచారం శ్రీనివాసరెడ్డి కారుదిగి.. నడవలేక పోవటంతో, ఆయన సహాయకులు.. వీల్ చైర్ లో కూర్చుబెట్టి.. ఎమర్జెన్సీ వార్డు ద్వారా ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లారు..
అయితే పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivasa Reddy).. కేసీఆర్ ను పరామర్శించటానికి వచ్చారా లేక చికిత్స కోసం వచ్చారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి కేసీఆర్ బెడ్ పై ఉన్నప్పుడే.. ఆయన సహచరుడు పోచారం సైతం వీల్ చైర్ లో కనిపించటం ప్రస్తుతం రాజకీయ వర్గాలలో ఆసక్తిగా మారింది. మరోవైపు పోచారం శ్రీనివాసరెడ్డి వయస్సు 74 ఏళ్లు.. ఆకారణంగా నడవడానికి ఇబ్బందీపడుతున్నారని అనుకుంటున్నారు.
బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేగా గెలుపొందిన పోచారం శ్రీనివాసరెడ్డి.. గత అసెంబ్లీలో ఆయన స్పీకర్ గా పని చేశారు. ఇప్పుడు కూడా బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది.. డిసెంబర్ 9వ తేదీ శనివారం అసెంబ్లీలో.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఇంతలోనే పోచారం, వీల్ చైర్ లో ఉండటం సంచలన చర్చగా మారింది.