Telugu News » Cabinet Ministers : తెలంగాణ కొత్త కేబినెట్ మంత్రులు వీరే..!!

Cabinet Ministers : తెలంగాణ కొత్త కేబినెట్ మంత్రులు వీరే..!!

కీలకమైన హౌంశాఖను ఎవరికి కేటాయించలేదు. మరో ఆరుగురికి మంత్రి వర్గంలో స్థానం కల్పించనుండగా.. వారికి ఏ శాఖలు కేటాయిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు ఏయే శాఖలు కేటాయించారో చూద్దాం..

by Venu
Assembly Results: Congress is strong in Telangana.. big victory in two places..!

తెలంగాణ (Telangana) సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మంత్రులకు శాఖలు కేటాయించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చాక రేవంత్‌తో పాటు మరో 11 మంది మంత్రులు ఈనెల 7 ప్రమాణ స్వీకారం చేయగా.. ఇంకా ఎవరికి శాఖలు కేటాయించలేదు. అయితే ఈరోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతుండగా.. తాజాగా మంత్రులకు శాఖలు కేటాయించారు.

Assembly Results: Congress is strong in Telangana.. big victory in two places..!

కాగా, కీలకమైన హౌంశాఖను ఎవరికి కేటాయించలేదు. మరో ఆరుగురికి మంత్రి వర్గంలో స్థానం కల్పించనుండగా.. వారికి ఏ శాఖలు కేటాయిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు ఏయే శాఖలు కేటాయించారో చూద్దాం..

భట్టి విక్రమార్క కి ఆర్థిక, ఇంధన శాఖ కేటాయించారు. తుమ్మల నాగేశ్వరరావు – వ్యవసాయ, చేనేత శాఖ.. జూపల్లి కృష్ణారావు – ఎక్సైజ్‌, పర్యాటక శాఖ.. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి – నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ.. దామోదర రాజనర్సింహ – వైద్య, ఆరోగ్య శాఖ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి – ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ మంత్రులుగా కొనసాగానున్నారు..

మరోవైపు శ్రీధర్‌బాబు – ఐటీ, పరిశ్రమల శాఖ, శాసనసభ వ్యవహారాల మంత్రిగా.. పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి – రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖ మంత్రిగా.. పొన్నం ప్రభాకర్‌ – రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా.. సీతక్క – మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా.. కొండా సురేఖ – అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రులుగా కొనసాగానున్నారు. కాగా రేవంత్‌రెడ్డి వద్దే హోం, పురపాలక, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు ఉన్నాయి..

You may also like

Leave a Comment