బాలీవుడ్ బడా హీరోలు అక్షయ్ కుమార్(Akshay Kumar), షారుక్ ఖాన్(Sharukh khan), అజయ్ దేవగన్(Ajay devgn)లకు అలహాబాద్ హైకోర్టు(Alahabad High Court)షాకిచ్చింది. పాన్ మసాలా యాడ్స్ విషయమై వారికి లీగల్ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ గుట్కా ప్రకటనలకు సంబంధించిన కేసును అటు హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా విచారిస్తోంది.
మోతీలాల్ యాదవ్ అనే న్యాయవాది గతంలో అలహాబాద్ హైకోర్టులో హీరోలు పాన్ మసాలా యాడ్స్ చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. భారత ప్రభుత్వం నుంచి గౌరవప్రదమైన పురస్కారాలు అందుకున్న వారు ఇలాంటి యాడ్స్ నటించడం సరికాదంటూ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన కోర్టు పిటిషనర్ అభ్యంతరాలపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అయితే, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని పేర్కొంటూ ఇటీవల పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ విషయంపై స్పందన కోరుతూ కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్బీ పాండే శుక్రవారం కోర్టుకు సమాచారం అందించారు. ఇందులో భాగంగా అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అజయ్ దేవగన్ అక్టోబర్ 22నే షోకాజ్ నోటీసులు జారీ చేశామని వెల్లడించారు.
మరోవైపు ఈ విషయంలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వెనక్కి తగ్గారు. గతంలో ఆయన ఓ పాన్ మసాలా యాడ్‌లు చేశారు. అయితే ఆ తర్వాత ఆ ప్రాజెక్టు నుంచి వెనక్కి తప్పుకుని కాంట్రాక్ట్‌ను బ్రేక్ చేసుకున్నారు. ఆ యాడ్స్ టెలికాస్ట్ ఆపకపోవడంతో ఆయన సదరు కంపెనీకి లీగల్ నోటీసులు పంపించారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు విచారణను 2024 మే 9కి వాయిదా వేసింది.