Telugu News » Congress : కాంగ్రెస్ ప్రభుత్వం పై మావోయిస్టు పార్టీ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు..!!

Congress : కాంగ్రెస్ ప్రభుత్వం పై మావోయిస్టు పార్టీ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు..!!

రేవంత్ రెడ్డి సీఎం పదవి చేపట్టిన అనంతరం ప్రజలే పాలకులు, మేము సేవకులం అని చెప్పిన మాటలను గుర్తుచేస్తూ.. ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణను ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఎన్ కౌంటర్లు లేని తెలంగాణను నిర్మించడం సాధ్యమతుందా? అని ప్రశ్నించారు జగన్..

by Venu
Assembly Results: Congress is strong in Telangana.. big victory in two places..!

ప్రత్యేక రాష్ట్రం వస్తే బ్రతుకులు బాగుపడతాయని తెలంగాణ (Telangana) ప్రజలు భావించారు.. కానీ ఒక దశాబ్ద కాలం పాటు తెలంగాణలో ప్రజా వ్యతిరేక నిరంకుశ పాలన కొనసాగిందని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ ఆరోపణలు చేస్తుంది. ఈ క్రమంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు మావోయిస్టు (Maoist) అధికార ప్రతినిధి జగన్ (Jagan)..

Assembly Results: Congress is strong in Telangana.. big victory in two places..!

బీఆర్ఎస్ (BRS) పార్టీని తిరస్కరించిన ప్రజలు ఎన్నికల్లో చిత్తుగా ఓడించి చెత్తకుప్పలో విసిరేశారని పేర్కొన్న జగన్.. మంచి పాలన అందిస్తుందనో, పూర్తిగా మేనిఫెస్టో అమలు చేస్తుందనో.. కాంగ్రెస్ ను గెలిపించలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడ్డాయని జగన్ ప్రకటించారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన దోపిడీ కంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దోపిడీ ఎక్కువగా జరిగిందని జగన్ వెల్లడించారు.

రేవంత్ రెడ్డి సీఎం పదవి చేపట్టిన అనంతరం ప్రజలే పాలకులు, మేము సేవకులం అని చెప్పిన మాటలను గుర్తుచేస్తూ.. ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణను ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఎన్ కౌంటర్లు లేని తెలంగాణను నిర్మించడం సాధ్యమతుందా? అని ప్రశ్నించారు జగన్.. జైళ్లో ఏళ్ల తరబడి మగ్గుతున్న రాజకీయ ఖైధీలను విడుదల చేయమని ప్రజల కోరుతున్నారు. విడుదల చేయగలరా?..

అక్రమ కేసులు బనాయించి.. మావోయిస్టులంటూ ముద్ర వేసిన వారిపై.. ఊపా చట్టం, ఎన్ఐఏ దాడులు చేస్తుంది.. వాటిని నిలిపివేసి.. వారిపై అక్రమ కేసులు కొట్టివేయడం మీ ప్రభుత్వంతో అవుతుందా? అని జగన్ ప్రశ్నించారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ధర్నా చౌక్‌ను పునరుద్ధరించి.. పౌర హక్కులకు, స్వేచ్ఛకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చట్టబద్ధ పాలన కొనసాగించమని ప్రజలు కోరుతున్నారన్నారని జగన్ అన్నారు..

మరోవైపు ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని జగన్ డిమాండ్ చేశారు.. రాష్ట్రంలో మిగులు భూములను, ప్రభుత్వ బంజరు భూములను వ్యవసాయ కూలీలకు పంచాలని, ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని ప్రజల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని జగన్ కోరారు.. డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ వెంటనే జరిగేలా చూడాలని.. క్యాజువల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని జగన్ డిమాండ్ చేశారు. కాజీపేటలో రైలు కోచ్ ఫ్యాక్టరీ విషయం కూడా ఆలోచించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని జగన్ కోరారు..

You may also like

Leave a Comment