Telugu News » Laxman : కాంగ్రెస్ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత..!

Laxman : కాంగ్రెస్ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత..!

ఇండియా కూటమి నేతల అవినీతిని వెలికి తీస్తుంటే, దర్యాప్తు సంస్థలపై, కాంగ్రెస్ నేతలు బురద జల్లుతున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు.. ఝార్ఖండ్ లో కాంగ్రెస్ నేత ధీరజ్ సాహు ఇంట్లో కోట్ల రూపాయల నల్లధనం డబ్బు బయటపడింది.. నోట్ల లెక్కింపు చేస్తున్న మిషన్లు పాడైపోయేంత డబ్బు ఉందని తెలిపిన లక్ష్మణ్.. వీటికి కాంగ్రెస్ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

by Venu
BJP MP Laxman: People consider BJP manifesto as holy book: BJP MP Laxman

తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ (Congress) ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి.. మరోవైపు ముందు ముందు ఈ గ్యారెంటీల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలో బీజేపీ (BJP) ఎంపీ లక్ష్మణ్, కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ గ్యారెంటీ అంటే అది అవినీతి దోపిడీకి గ్యారెంటీ అని లక్ష్మణ్ విమర్శించారు.

MP Laxman

ఇండియా కూటమి నేతల అవినీతిని వెలికి తీస్తుంటే, దర్యాప్తు సంస్థలపై, కాంగ్రెస్ నేతలు బురద జల్లుతున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు.. ఝార్ఖండ్ లో కాంగ్రెస్ నేత ధీరజ్ సాహు ఇంట్లో కోట్ల రూపాయల నల్లధనం డబ్బు బయటపడింది.. నోట్ల లెక్కింపు చేస్తున్న మిషన్లు పాడైపోయేంత డబ్బు ఉందని తెలిపిన లక్ష్మణ్.. వీటికి కాంగ్రెస్ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.. ఝార్ఖండ్ లో కుంభకోణాలు పెరిగాయని ఆరోపించారు..

మోడీ గ్యారెంటీ అంటే అభివృద్ధి, పేదల సంక్షేమం, నల్ల ధనం వెలికితీయడం అని లక్ష్మణ్ తెలిపారు. అవినీతిపరులు తిన్న సొమ్మంతా మోడీ కక్కిస్తారని పేర్కొన్న లక్ష్మణ్.. ప్రధాని మోడీ పై చిన్న అవినీతి ఆరోపణ లేకుండా పాలిస్తుంటే ప్రతిపక్ష పార్టీలు సహించలేకపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియారిటీ కాదని ఎంఐఎంను మచ్చిక చేసుకోవడానికి కాంగ్రెస్.. ఆ పార్టీ నేతను ప్రొటెం స్పీకర్ చేయడం విడ్డూరమని లక్ష్మణ్ అన్నారు..

ఇక మధ్యప్రదేశ్ (Madhya Pradesh) సీఎం ఎంపిక పై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని లక్ష్మణ్ (Laxman) పేర్కొన్నారు. ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం ఎవరనేది నిర్ణయిస్తారని తెలిపిన లక్ష్మణ్.. ప్రజాస్వామ్య బద్దంగా సీఎం ఎంపిక ప్రక్రియ ఉంటుందని వివరించారు..

You may also like

Leave a Comment