తెలంగాణ (Telangana) మాజీ డీజీపీ (EX DGP) అంజనీకుమార్ (Anjani Kumar)కి బిగ్ రిలీఫ్ దొరికింది. ఎన్నికల ఫలితాలు వెలువెడుతున్న సమయంలో.. ఎలక్షన్ కోడ్ (Election Code) అమల్లో ఉన్నప్పటికీ.. అంజనీకుమార్.. రేవంత్ రెడ్డిని కలిసి ప్రమాణ స్వీకారంపై చర్చించారు.. అప్పటికే కాంగ్రెస్ లీడ్‌లో ఉంది. ఈమేరకు గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని తెలుసుకొని అంజనీకుమార్ ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ప్రచారం జరిగింది.
అంజనీకుమార్ ముందస్తుగా రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని కలవడంతో ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డిని కలవడంపై అంజనీ కుమార్‌ను వివరణ కోరిన ఈసీ.. ఆయన్ని సస్పెండ్ చేస్తోన్నట్టు ఆదేశాలు జారీచేసింది. కాగా అంజనీ కుమార్ స్థానంలో తెలంగాణ డీజీపీగా రవి గుప్తాను నియమించింది.. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి.. కొత్త ప్రభుత్వం కూడా కొలువు తీరింది.
ఈ క్రమంలో అంజనీ కుమార్ సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూస్తానని కేంద్ర ఎన్నికల సంఘానికి అంజనీకుమార్ వివరణ ఇచ్చినట్టు సమాచారం.. దీంతో ఆయన వివరణతో సంతృప్తి వ్యక్తం చేసిన ఈసీ.. సస్పెన్స్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.