Telugu News » KCR : కేసీఆర్ అభిమానులకి గుడ్ న్యూస్.. !!

KCR : కేసీఆర్ అభిమానులకి గుడ్ న్యూస్.. !!

అనారోగ్యంతో సుమారు వారం రోజులుగా యశోద ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న కేసీఆర్.. ప్రస్తుతం కొలుకుంటున్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు. రేపు కేసీఆర్ ను డిశ్చార్జ్ చేస్తున్నట్లు వారు వెల్లడించారు. మరోవైపు కేసీఆర్‌ను పరామర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ, చిత్రపరిశ్రమకి చెందిన ప్రముఖులు ఆయనను పరామర్శించిన విషయం తెలిసిందే..

by Venu
cm kcr submitted resignation letter to governor

సింహం సింగిల్ గా వచ్చింది.. గుంపును తయారు చేసింది.. పది సంవత్సరాలు తిరుగు లేకుండా పాలించింది. ఇంతకు ఈ సింహం ఎవరని అనుకుంటున్నారా? బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కి ఇచ్చిన బిరుదని ప్రచారం.. బీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పుడు ఇదే విషయాన్ని ఎన్నో సార్లు ప్రస్తావించారని అనుకొంటున్నారు.. అదీగాక రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలుపుని తన భుజాల మీద వేసుకొని పార్టీని రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన ఘనత కూడా గులాబీ బాస్ కి సొంతం అని అనేవారు కూడా ఉన్నారు..

BREAKING: KCR seriously injured.. admitted to hospital..!

మరోవైపు తుంటి ఎముక విరగడం వల్ల యశోద ఆసుపత్రి (Yashoda Hospital)లో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ (KCR)..రేపు డిశ్చార్జ్ అవుతోన్నట్టు సమాచారం.. డిశ్చార్జ్ అనంతరం ఫామ్ హౌస్ కి వెళ్ళకుండా.. నంది నగర్ (Nandi Nagar) ఇంటికి, కేసీఆర్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కోసం నంది నగర్ ఇంటిని సిద్దం చేస్తోన్నట్టు పార్టీ వర్గాల సమాచారం.. అయితే కేసీఆర్.. మొదట కవిత (Kavitha) ఇంటికి వెళ్తారనే ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం నంది నగర్ ఇంటికి వెళ్ళడానికి కేసీఆర్ సిద్దం అయినట్టు తెలుస్తోంది.

అనారోగ్యంతో సుమారు వారం రోజులుగా యశోద ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న కేసీఆర్.. ప్రస్తుతం కొలుకుంటున్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు. రేపు కేసీఆర్ ను డిశ్చార్జ్ చేస్తున్నట్లు వారు వెల్లడించారు. మరోవైపు కేసీఆర్‌ను పరామర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ, చిత్రపరిశ్రమకి చెందిన ప్రముఖులు ఆయనను పరామర్శించిన విషయం తెలిసిందే..

ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) ఓటమి చెందినప్పటి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఎన్నికల ముందు ఆయన చేసిన పూజలు.. వ్రతాలు అధికారం కట్టబెట్టలేదనే గుసగుసలు వినిపిస్తోన్నాయి.. కొంత మంది అయితే కర్మ నువ్వు మరచిన అది నిన్ను వెంటాడుతోందని అనుకొంటున్నట్టు టాక్..

You may also like

Leave a Comment