Telugu News » KCR Discharge: యశోద ఆస్పత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్..!

KCR Discharge: యశోద ఆస్పత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్..!

బంజారాహిల్స్‌లోని నందినగర్‌(Nandi Nagar)లో ఉన్న నివాసానికి కేసీఆర్ వెళ్లారు. ఈనెల 7వ తేదీన ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జారిపడడంతో కేసీఆర్ ఎడమ తుంటికి గాయమైన విషయం విధితమే.

by Mano
KCR Discharge: Former CM KCR discharged from Yashoda Hospital..!

బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్(Discharge) అయ్యారు. అనంతరం బంజారాహిల్స్‌లోని నందినగర్‌(Nandi Nagar)లో ఉన్న నివాసానికి కేసీఆర్ వెళ్లారు. ఈనెల 7వ తేదీన ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జారిపడడంతో కేసీఆర్ ఎడమ తుంటికి గాయమైన విషయం విధితమే.

KCR Discharge: Former CM KCR discharged from Yashoda Hospital..!

దీంతో సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో వైద్యులు తుంటి మార్పడి శస్త్ర చికిత్స చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనను పరామర్శించిన సంగతి తెలిసిందే.

ఆస్పత్రికి తనను పరామర్శించడానికి ప్రముఖులు, అభిమానులు భారీగా తరలిరావడంతో త్వరలో ప్రజల్లోకి వస్తానని వీడియో సందేశం ఇచ్చారు కేసీఆర్. ఆస్పత్రిలో వారం రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవడానికి పరిమితం కాకుండా సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదివారు.

ప్రస్తుతం కేసీఆర్ కోలుకోవడంతో ఇవాళ ఆస్పత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. కేసీఆర్ సీఎం కావడానికి ముందు నందినగర్‌లోని ఆయన నివాసంలో ఉండేవారు. ఇప్పుడు ఆస్పత్రి నుంచి నేరుగా అక్కడికే వెళ్లారు. అయితే కేసీఆర్ అక్కడే ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు చికిత్స అందించనున్నారు డాక్టర్లు.

You may also like

Leave a Comment