Telugu News » Telangana : లోక్ సభ ఎన్నికల కోసం సరికొత్త వ్యూహాలు.. రంగంలోకి మోడీ, సోనియా..?

Telangana : లోక్ సభ ఎన్నికల కోసం సరికొత్త వ్యూహాలు.. రంగంలోకి మోడీ, సోనియా..?

బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితి తెగిన గాలిపటంలా ఉందని భావిస్తున్న ప్రధాన పార్టీలు.. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోతున్న గులాబీని కాస్త పక్కన పెట్టినట్టు సమాచారం.. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలు నువ్వా? నేనా? అంటూ తలపడడానికి సిద్దం అవుతోన్నట్టు ప్రచారం మొదలైంది.

by Venu

తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయిందనే ప్రచారం సాగుతోంది. ఎన్నో ఒడిదుడుకుల మధ్య.. పదేళ్ళ తర్వాత.. తెలంగాణలో విజయాన్ని అందుకొన్న కాంగ్రెస్ (Congress).. సవాళ్ళతో కూడుకొన్న టాస్క్ పూర్తి చేయాలనే వ్యూహంతో.. ముందుకు వెళ్తుండగా.. బీజేపీ (BJP) సైతం పాగా వేయాలనే ప్రయత్నాలని ముమ్మురం చేస్తోన్నట్టు వార్తలు వినిపిస్తోన్నాయి.

అసెంబ్లీ ఎలక్షన్లో ఎలాగో అనుకొన్న స్కోర్ చేయలేదని భావించిన రెండు నేషనల్‌ పార్టీలు..లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha elections) సత్తా చాటాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో పొలిటికల్‌ సీన్‌ పూర్తిగా మారిపోనుందా అనే సందేహాలు వ్యక్తం అవుతోన్నాయి. అయితే మొన్నటి వరకి రాష్ట్రంలో బలంగా ఉన్న బీఆర్‌ఎస్‌.. (BRS) ఓటమితో వెనకబడినా.. లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ మెదక్‌ నుంచి పోటీ చేస్తారనేది ప్రచారంలో ఉంది. అయితే కేసీఆర్‌పై పోటీకి సోనియా గాంధీని బరిలో నిలుపుదామని హస్తం నేతలు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

కానీ బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితి తెగిన గాలిపటంలా ఉందని భావిస్తున్న ప్రధాన పార్టీలు.. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోతున్న గులాబీని కాస్త పక్కన పెట్టినట్టు సమాచారం.. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలు నువ్వా? నేనా? అంటూ తలపడడానికి సిద్దం అవుతోన్నట్టు ప్రచారం మొదలైంది. కాగా నయా నయా స్కెచ్చులతో ఈ రెండు నేషనల్‌ పార్టీస్‌ దూసుకొస్తుండటం చూస్తే.. అది నిజమే అనిపిస్తోంది. దేనికదే ఖతర్నాక్‌ ప్లాన్‌తో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇందులో భాగంగా ఎంపీ ఎలక్షన్స్‌లో ఇద్దరు అగ్రనేతల్ని ఈసారి రాష్ట్రం నుంచి బరిలో నిలిపేలా వ్యూహరచన చేస్తున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే రాష్ట్రంలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌… పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ అదే జోష్‌ను కంటిన్యూ చేయాలని భావిస్తూ.. తెలంగాణలో ఏదో ఒక ఎంపీ స్థానం నుంచి సోనియాను.. బరిలో నిలిపేలా ఒప్పించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఒకవేళ అదే జరిగితే.. మెదక్‌, మల్కాజ్‌గిరి, కరీంనగర్‌.. ఈ మూడింట్లో ఏదో ఒక స్థానం నుంచి ఆమెను బరిలో నిలపేలా టీపీసీసీ ప్లాన్‌ చేస్తోందని సమాచారం. బీజేపీ సైతం ఇదే టైపు అస్త్రాన్ని పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రయోగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ప్రధాని నరేంద్ర మోడీని.. బరిలో దిగేలా ఒప్పించే ఆలోచనలో తెలంగాణ బీజేపీ నేతలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

అయితే మోడీ.. సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్‌ లో ఏదో ఒక స్థానం నుంచి ప్రధాని బరిలో ఉండనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే గనుక జరిగితే.. అటు కాంగ్రెస్‌ నుంచి సోనియా.. ఇటు బీజేపీ నుంచి మోడీ.. మొత్తానికి లోక సభ ఎన్నికలు సైతం ఉత్కంఠంగా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది..

You may also like

Leave a Comment