Telugu News » Revanth Reddy : ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఓడిన నేతల్లో చిగురిస్తున్న ఆశలు..!!

Revanth Reddy : ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఓడిన నేతల్లో చిగురిస్తున్న ఆశలు..!!

మరోవైపు ప్రస్తుత కేబినెట్‌లో నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యత దక్కలేదు. మిగిలి ఉన్న 6 బెర్తుల కోసం దాదాపు డజను మందికిపైగా పోటీ పడుతున్నారు. కాగా ఎన్నికల్లో ఓడిన వారు సైతం ఈ పోటీలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ ఆరు బెర్తులపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తోన్నాయి..

by Venu
cm revanth reddy review on dharani portal

తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ( Revanth Reddy) ఢిల్లీ (Delhi)కి బయల్దేరారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో వెళ్ళిన రేవంత్.. ఢిల్లీలో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై హైకమాండ్‌తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం..

key comments by tpcc chief revanth reddy

ఈ క్రమంలో రేవంత్, ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) కూడా సమీపిస్తుండటంతో.. పదవుల పంపిణీ ద్వారా పార్టీలో జోష్‌ తేవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆరు బెర్తులు తెలంగాణ (Telangana) కేబినెట్‌లో ఖాళీగా ఉన్నాయి. అందులో హోం శాఖ, విద్యాశాఖతో పాటు పలు కీలక శాఖలు ఉన్నాయి.

మరోవైపు ప్రస్తుత కేబినెట్‌లో నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యత దక్కలేదు. మిగిలి ఉన్న 6 బెర్తుల కోసం దాదాపు డజను మందికిపైగా పోటీ పడుతున్నారు. కాగా ఎన్నికల్లో ఓడిన వారు సైతం ఈ పోటీలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ ఆరు బెర్తులపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తోన్నాయి..

You may also like

Leave a Comment