Telugu News » CM Siddaramaiah: అసెంబ్లీలో వ్యాఖ్యలపై వీడియో.. కేటీఆర్‌కు సిద్ధరామయ్య కౌంటర్..!!

CM Siddaramaiah: అసెంబ్లీలో వ్యాఖ్యలపై వీడియో.. కేటీఆర్‌కు సిద్ధరామయ్య కౌంటర్..!!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధరామయ్య వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ కేటీఆర్ సెటైర్లు విసిరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా, కేటీఆర్‌కు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య x వేదికగా కౌంటర్ ఇచ్చారు.

by Mano
CM Siddaramaiah: Video on Assembly remarks.. Siddaramaiah's counter to KTR..!!

తెలంగాణ(Telangana)లో అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్(BRS) నేతలు కాంగ్రెస్‌పై వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ x(ట్విట్టర్)లో ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధరామయ్య వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ కేటీఆర్ సెటైర్లు విసిరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా, కేటీఆర్‌కు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య x వేదికగా కౌంటర్ ఇచ్చారు.

CM Siddaramaiah: Video on Assembly remarks.. Siddaramaiah's counter to KTR..!!

‘‘ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇస్తాం.. అంత మాత్రాన ఫ్రీగా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉంది. అయితే ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు’’ అంటూ కర్నాటక సీఎం సిద్దరామయ్య అసెంబ్లీలో చెబుతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోను కేటీఆర్ తన x ఖాతాలో రీట్వీట్ చేస్తూ.. ‘‘ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి డబ్బులు లేవని సిద్ధరామయ్య అంటున్నారు. మోసపూరిత వాగ్దానాలు ఎలా చేస్తారు? తెలంగాణ భవిష్యత్తు ఇంతేనా?..’’ అని ప్రశ్నించారు.

కేటీఆర్ చేసిన ట్వీట్‌కు సీఎం సిద్దరామయ్య ఘాటుగా స్పందించారు. ‘‘మిస్టర్ కేటీఆర్.. తెలంగాణలో మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలుసా..? మీకు ఏది సత్యం ఏది అసత్యం అనేది ధృవీకరించడం కూడా తెలీదు. బీజేపీ ఎడిట్ చేసిన నకిలీ వీడియోలను మీరు సర్క్యూలేట్ చేస్తున్నారు. అందుకే మీరు బీజేపీ పర్ఫెక్ట్ బీ టీమ్..’’ అంటూ సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చారు.

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని సిద్ధరామయ్య ఇది వరకే ట్విట్టర్ వేదికగా స్పందించారు. బీజేపీ నేతలు అశ్వత్ నారాయణ, సి.టి రవి తనపై దుష్ప్రచారం చేస్తున్నారాని తన వ్యాఖ్యలను వక్రీకరించి ఎడిట్ చేసి వాటిని వ్యాప్తి చేస్తున్నారంటూ మండిపడ్డారు. అదేవిధంగా 2018లో హామీల అమలులో బీజేపీ విఫలమైందని బీజేపీ మాజీ సీఎం యడ్యూరప్ప అంగీకరించగా ఆ మాటలను తారుమారు చేసి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఇదిలా ఉండగా మాజీ మంత్రి కేటీఆర్.. ఎన్నికలకు ముందు ఫాక్స్ కాన్ చైర్మన్‌కు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లేఖ రాశారంటూ ఓ ఫేక్ లెడర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అంతేకాదు, గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య చేసుకున్న సమయంలోనూ కేటీఆర్.. ‘అసలు ఆమె గ్రూప్-2కే అప్లై చేయలేదంటా..’ అంటూ రాసుకొచ్చారు. దీంతో నెటిజన్లు ఆధారాలతో సహా నిరూపించడంతో కేటీఆర్‌ విమర్శలపాలయ్యారు. తాజాగా కర్ణాటక సీఎంకు సంబంధించిన ఫేక్ వీడియోను ఆయన షేర్ చేయడంతో నెటిజన్లు మరోసారి మండిపడుతున్నారు.

You may also like

Leave a Comment