Telugu News » Raghunandan Rao : కాళేశ్వరం అవినీతిపై కుట్ర.. కాంగ్రెస్ మీద అనుమానం..!!

Raghunandan Rao : కాళేశ్వరం అవినీతిపై కుట్ర.. కాంగ్రెస్ మీద అనుమానం..!!

కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నాడు…ఆ డబ్బులు వసూలు చేసి పేద ప్రజల అకౌంట్స్ లో వేస్తానని తెలిపిన రాహుల్.. రేవంత్ రెడ్డి ఇప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు? అని రఘునందన్ ప్రశ్నించారు.

by Venu
raghunandan-rao

తెలంగాణ (Telangana)లో జరిగిన అన్ని స్కామ్ లలో.. కాళేశ్వరం స్కామ్ (Kaleshwaram scam) అతి పెద్దదని గత కొన్ని నెలలుగా ఆరోపణలు వస్తోన్న విషయం తెలిసిందే.. ఎన్నికల ప్రచారంలో సైతం కాంగ్రెస్ నేతలు ఈ అంశాన్ని ఆయుధంగా మలచుకొని ప్రజల్లోకి వెళ్లారు. మరోవైపు రేవంత్ రెడ్డి కాళేశ్వరం అవినీతి పై కీలక వ్యాఖ్యలు చేశారు.. అయితే ప్రస్తుతం రేవంత్ సీఎం అయ్యాక.. ఆయన రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన మాట మరచినట్టు ఉన్నాడని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శిస్తున్నారు..

ఈ క్రమంలో కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి (Revanth Reddy) గతంలో డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేసిన రఘునందన్ రావు.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి రాష్ట్ర సీఎంగా ఉన్నారు. ఇప్పుడు సీబీఐ విచారణకు ఆదేశించే అధికారాలు ఉన్నా.. ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. అదీగాక కాళేశ్వరం పై వివరాలు ఇవ్వాలని కాగ్ కోరినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని రఘునందన్ మండిపడ్డారు..

కాంగ్రెస్ నేతలు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రచారం చేశారని.. కానీ ఇప్పుడు బీఆర్ఎస్.. కాంగ్రెస్ ఒక్కటిగా కలిశాయన్న విషయం అర్థంవుతోందని రఘునందన్ (Raghunandan Rao) ఆరోపించారు.. ఎన్నికల ముందు రేవంత్, రాహుల్ గాంధీ మేడిగడ్డకి వెళ్లి కేసీఆర్ (KCR).. కాళేశ్వరం కరప్షన్ రావు అని హడావుడి చేయడం రాష్ట్రం మొత్తం తెలుసని రఘునందన్ రావు అన్నారు..

మరి ఇప్పుడు ఆ హడావుడి అధికారంలోకి వచ్చాక కనిపించడం లేదని రఘునందన్.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.. ఇక కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నాడు…ఆ డబ్బులు వసూలు చేసి పేద ప్రజల అకౌంట్స్ లో వేస్తానని తెలిపిన రాహుల్.. రేవంత్ రెడ్డి ఇప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు? అని రఘునందన్ ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిని మెడిగడ్డ వరకే పరిమితం చేయాలనే కుట్ర రాష్ట్రంలో జరుగుతుందని రఘునందన్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మీద అనుమానం వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంఅవినీతి పై గతంలో రేవంత్ రెడ్డి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కి లేఖ రాశారని గుర్తు చేసిన రఘునందన్.. ఇప్పుడు సీఎం గా తన దగ్గర ఉన్న ఆధారాలను కేంద్రానికి పంపాలని డిమాండ్ చేస్తున్నట్టు వెల్లడించారు..

You may also like

Leave a Comment