జూనియర్ డాక్టర్ల (Junior Doctors)తో తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) జరిగిన చర్చలు సఫలమయ్యాయి. సచివాలయంలో మంగళవారం ఆరోగ్యశాఖ మంత్రి(Health Minister) దామోదర రాజనర్సింహ(Damodara Raja narsimha) జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపారు.
మూడు నెలలుగా స్టై ఫండ్ అందకపోవడంతో ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యార్థులు సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే నిన్న హెల్త్ సెక్రటరీతో సమావేశం అయ్యారు. ఆరోగ్య శాఖ మంత్రి జూనియర్ డాక్టర్ల సమస్యను చర్చిస్తారని హెల్త్ సెక్రటరీ నిన్న హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ మేరకు వారితో చర్చలు మంత్రి దామోదర రాజనర్సింహ చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రతీ నెల 15 వరకు స్టైఫండ్ వచ్చేలా చూస్తామని మంత్రి అన్నారు. అదేవిధంగా హాస్టళ్లలో వసతులు కల్పించడంతో పాటు కొత్త హాస్టళ్లను నిర్మిస్తామని ఆయన తెలిపారు.
జాతీయ వైద్య మండలి నిబంధనల ప్రకారమే అన్ని వసతులు కల్పిస్తామని ప్రభుత్వం హమీ ఇచ్చిందని జూనియర్ డాక్టర్ల ప్రతినిధులు వెల్లడించారు. వీటితో పాటు మిగతా సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్న మంత్రి ప్రకటించడంతో సమ్మెకు వెళ్లడం లేదని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. మంత్రి హామీతో సమ్మెకు బ్రేక్ పడింది.