కరోనా ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని శాసించిన బయోవార్.. ఈ వేపన్ రక్తం చిందించలేదు.. హింసను సృష్టించ లేదు.. కానీ ప్రపంచం మెత్తం గడగడ వణికించింది. మనిషికి మనిషి బరువైయ్యేలా మార్చింది.. నిజమైన ప్రేమలని సైతం సమాధి చేసింది. అలాంటి కరోనా.. మళ్ళీ ప్రాణం పోసుకొని.. ప్రపంచంలో అడుగుపెడుతోందనే వార్తలు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి..
ఇప్పటికే రాష్ట్రంలో కోవిడ్ వైరస్ (Covid Virus) ప్రవేశించిందని.. వ్యాధి సోకిన వారు గాంధీ ఆస్పత్రి (Gandhi Hospital)లో చేరారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం పూర్తిగా బూటకమంటోన్నారు అధికారులు.. ఇలాంటి వదంతులను నమ్మవద్దని తెలుపుతోన్నారు. కేరళ (Kerala)లో విస్తరిస్తున్న జేఎన్-1 వైరస్‌తో గాంధీలో ఐదుగురు చేరారనేది పూర్తిగా అబద్ధం. ఆ ప్రచారంలో వాస్తవం లేదన్నారు సికింద్రాబాద్ (Secunderabad) గాంధీ ఆసుపత్రి (Gandhi Hospital) సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు..
మరోవైపు కోవిడ్ మహమ్మారి ముగిసిన తర్వాత, స్థానికంగా ఒకటి లేదా రెండు కేసులు నమోదు కావడం సాధారణం. కానీ ఈ నెలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపిన ఆసుపత్రి సూపరింటెండెంట్.. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైందని అన్నారు.. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ వ్యాప్తి పై సిద్దంగా ఉండాలని కేంద్రం పలు సూచనలు, సలహాలు చేసిందని తెలిపారు..
ఇందులో భాగంగా రాష్ట్ర వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఇతర వైద్యాధికారులు ఈ అంశంపై అప్రమత్తం అవ్వాలని తెలిపినట్టు..గాంధీ ఎమర్జెన్సీ విభాగంలో గతంలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ వార్డులో పురుషులకు 30, మహిళలకు 20 మొత్తం 50 పడకలు అందుబాటులో ఉండగా.. వాటిపై ఆరా తీసినట్టు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరించారు.
మరోవైపు రాబోయే క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి పండుగలలో కోవిడ్ వంటి వైరస్ మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని.. అయ్యప్ప స్వాముల వల్ల కూడా కోవిడ్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలున్నట్టు తెలిపిన సూపరింటెండెంట్.. రద్దీ ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. హ్యాండ్ శానిటైజేషన్ పాటించాలని సూచించారు. అదీగాక కోవిడ్ కేసులు పెరిగితే గాంధీ మెడికల్ కాలేజీలోని వైరాలజీ ల్యాబ్‌లో జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహిస్తారని, కోవిడ్ పరీక్షలు, పిపిఇ కిట్లు, టీకాలు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు..