Telugu News » Assembly Sessions 2023 : అసెంబ్లీలో కరెంట్ మంటలు.. విద్యుత్ అంశంపై రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!!

Assembly Sessions 2023 : అసెంబ్లీలో కరెంట్ మంటలు.. విద్యుత్ అంశంపై రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!!

రాష్ట్ర వ్యవసాయానికి ఎన్ని గంటలు విద్యుత్ ఇచ్చారో తెలుసుకునేందుకు ముందుకు వస్తే, అఖిలపక్షంతో నిజ నిర్ధారణ కమిటీ కూడా వేద్దామని ముఖ్యమంత్రి వెల్లడించారు. మరోవైపు తమ ఆర్థిక తప్పిదాలను కప్పిపుచ్చుకునేలా ఎదురు దాడి చేస్తున్నామని బీఆర్​ఎస్​ నేతలు భావిస్తున్నట్టు రేవంత్ రెడ్డి ఆరోపించారు.

by Venu
tpcc-revanth-reddy-strong-counter-to-minister-ktr

శీతాకాలపు అసెంబ్లీ సమావేశాలు వేసవి వేడిని మరిపించేలా సాగుతోన్నాయి. ఇక్కడ జరిగే చర్చలు ఎప్పుడు ఏ మలుపు తీసుకొంటుందో తెలియకుండా ఉత్కంఠంగా మారుతోన్నాయి. అయితే ఈ రోజు విద్యుత్​కు సంబంధించిన అంశాలపై జరుగుతోన్న చర్చలో ఆసక్తికర అంశం చోటు చేసుకోంది.. విద్యుత్​కు సంబంధించిన మూడు అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక ప్రకటన చేశారు.

విద్యుత్ రంగం అంశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై చర్చ జరుగుతోన్న సందర్భంగా విచారణ జరపాలన్న మాజీ మంత్రి జగదీశ్​ రెడ్డి (Jagdish Reddy) వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి.. ఆ సవాల్​ను స్వాగతిస్తున్నామని షాకిచ్చారు. ఛత్తీస్​గఢ్ (Chhattisgarh) నుంచి విద్యుత్ కొనుగోళ్లు (Power Purchases) విషయంలో భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులపై న్యాయ విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యవసాయానికి ఎన్ని గంటలు విద్యుత్ ఇచ్చారో తెలుసుకునేందుకు ముందుకు వస్తే, అఖిలపక్షంతో నిజ నిర్ధారణ కమిటీ కూడా వేద్దామని ముఖ్యమంత్రి వెల్లడించారు. మరోవైపు తమ ఆర్థిక తప్పిదాలను కప్పిపుచ్చుకునేలా ఎదురు దాడి చేస్తున్నామని బీఆర్​ఎస్​ నేతలు భావిస్తున్నట్టు రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు అవగాహన రాహిత్యంతో జరిగినవా.. లేక ఉద్దేశపూర్వకంగా చేశారా అనేది విచారణలో తేలుతుందని అన్నారు.

మరోవైపు టెండర్లు లేకుండానే.. అత్యవసరమంటూ గత ప్రభుత్వం ఛత్తీస్​గఢ్​తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుందని ఆరోపించిన రేవంత్ రెడ్డి.. గతంలో ఈ విషయాన్ని అసెంబ్లీలో చెప్పే ప్రయత్నం చేస్తే, మార్షల్స్​తో బయటకు పంపించారని గుర్తు చేశారు. ఓ అధికారి వాస్తవాలు చెబితే హోదా తగ్గించి మారుమూల ప్రాంతానికి పంపించారని వివరించారు. ఛత్తీస్​గఢ్​తో విద్యుత్ ఒప్పందం వల్ల ప్రజలపై రూ.1,326 కోట్ల భారం పడిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు..

You may also like

Leave a Comment