Telugu News » Speaker Gaddam Prasad : వ్యక్తిగత దూషణలు వద్దు.. సభ మర్యాదలు కాపాడండి..!!

Speaker Gaddam Prasad : వ్యక్తిగత దూషణలు వద్దు.. సభ మర్యాదలు కాపాడండి..!!

రాజగోపాల్ రెడ్డి.. ఇదే సభలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్.. ఉరికించి కొడతా అని విమర్శించినప్పుడు ఎటు పోయింది మీ సంస్కారం అని మండిపడ్డారు. మీరు మాట్లాడితే ఒప్పు.. మేము మాట్లాడితే తప్పా అని ప్రశ్నించారు..

by Venu
Akbaruddin Owaisi Appointed as Pro-tem Speaker of Telangana Assembly

తెలంగాణ (Telangana) అసెంబ్లీ సమావేశాల్లో అన్ని కీలక అంశాలపై చర్చలు జోరుగా సాగుతోన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర అప్పులపై నేతల మధ్య విమర్శల వార్ పీక్స్ లోకి వెళ్తున్నట్టు సమాచారం. విమర్శలు, ఆరోపణలతో అసెంబ్లీ శీతాకాలాన్ని మరిపిస్తుందని అనుకొంటున్నారు.. మరోవైపు కరెంట్ అంశంపై జరుగుతోన్న చర్చ రచ్చ రచ్చ చేస్తుందని ఈ రచ్చ వల్ల అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పెరిగిందని సమాచారం..

Akbaruddin Owaisi Appointed as Pro-tem Speaker of Telangana Assembly

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivasa Reddy) ఇరు పక్షాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.. సభ హుందాతనం కాపాడండని నేతలకి తెలిపారు. కొత్త సభ్యులు సభ నియమాలు నేర్చుకోవాలని సూచించారు. ఇద్దరు వ్యక్తి గత దూషణల వరకు వెళ్ల వద్దని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇదే సమయంలో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో తెలియదు.. తప్పు చేయకున్నా.. కొన్ని సార్లు శిక్ష పడుతుందని బీఆర్ఎస్ ఓటమిని దృష్టిలో పెట్టుకొని పోచారం వ్యాఖ్యానించారు..

మరోవైపు అసెంబ్లీలో కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) ఖబడ్దార్ అని మాట్లడటంతో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు.. రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జగదీష్ రెడ్డి డిమాండ్ (Jagdish Reddy) చేశారు.. ఇంతలో స్పీకర్ గడ్డం ప్రసాద్ జోక్యం చేసుకొని.. వ్యక్తిగత దూషణలు వద్దు.. సభ మర్యాదలు కాపాడండని సూచించారు..

అనంతరం మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. ఇదే సభలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్.. ఉరికించి కొడతా అని విమర్శించినప్పుడు ఎటు పోయింది మీ సంస్కారం అని మండిపడ్డారు. మీరు మాట్లాడితే ఒప్పు.. మేము మాట్లాడితే తప్పా అని ప్రశ్నించారు..

You may also like

Leave a Comment