చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్ (Prague)లో కాల్పులు కలకలం సృష్టించాయి. జన్ పలాచ్ స్క్వేర్ (Jan Palach Square)లోని చార్లెస్ విశ్వవిద్యాలయం (Charles University) ఫిలాసఫీ విభాగం భవనంలోకి ఓవ్యక్తి ప్రవేశించి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 20మందికి గాయాలవగా.. మరో 15మంది మరణించినట్టు సమాచారం.. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దుండగుడి పట్టుకొన్నట్టు తెలుస్తోంది.
కాల్పుల్లో గాయపడిన బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు.. గాయపడ్డ వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు యూనివర్సిటీ చుట్టుపక్కల ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకొన్న పోలీసులు.. అనుమానంతో సోదాలు నిర్వహించారు. కాగా కాల్పులు జరిపిన ఆగంతకుడు.. అదే విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థిగా అధికారులు గుర్తించారు.
కాల్పుల ఘటన వెనుక తీవ్రవాద హస్తం లేదని చెక్ అంతర్గత శాఖ మంత్రి విట్ రాకుసన్ స్పష్టం చేశారు. విచారణలో ప్రజలు అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ మధ్య కాలంలో విదేశాలలో ఇలాంటి అఘాయిత్యాలు తరచుగా జరగడం ప్రపంచాన్ని ఆందోళనకి గురిచేస్తుంది. ప్రాణాలు అంటే లెక్కలేని కొందరు గన్ కల్చర్ ఫాలో అవుతూ.. కాల్పులకి తెగబడటంతో వారి చేతిలో మరణించే వారి సంఖ్య సైతం పెరగుతోంది..