నగర ప్రజలను అగ్నిప్రమాదాలు వణికిస్తోన్నాయి. ఈ సంవత్సరం నగరంలో ఎక్కువ మొత్తంలో అగ్నిప్రమాదాలు జరగ్గా.. ఆస్తినష్టం పెద్ద మొత్తంలో సంభవించింది.. కానీ ఎక్కువగా ప్రాణ నష్టం జరగలేదు.. మరోవైపు కొత్త సంవత్సరానికి తొమ్మిది రోజుల సమయం ఉందనగా.. అగ్నిదేవుడు మరోసారి విజృంభించాడు.. నగరంలోని పంజాగుట్ట (Panjagutta) ఎర్రమంజిల్ ( Erramnzil)లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది.
అపార్ట్మెంట్ ఆరో అంతస్తులో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. బిల్డింగ్ మొత్తానికి వ్యాపించడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. అందులో నివసిస్తున్న కొంతమంది ప్రాణభయంతో బయటికి వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈమేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
కాగా, అక్కడే విధులు నిర్వహిస్తోన్న ట్రాఫిక్ కానిస్టేబుల్, శ్రావణ్ కుమార్.. మంటల్లో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని కాపాడారు. అక్కడ ఉన్న డంబెల్ సహాయంతో డోరును బద్దలు కొట్టి వారిని బయటకు తీసుకొచ్చారు. మరోవైపు షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్టు సమాచారం.. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది..