Telugu News » CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డికి అస్వస్థత.. కరోనా టెస్టు చేయనున్న డాక్టర్లు..!

CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డికి అస్వస్థత.. కరోనా టెస్టు చేయనున్న డాక్టర్లు..!

జలుబు, దగ్గుతో కూడా ఇబ్బంది పడుతున్న రేవంత్‌కు వైద్యులు ఆర్టీపీసీఆర్(RTPCR) పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం.

by Mano
CM Revanth Reddy: CM Revanth Reddy is sick.. Doctors will do corona test..!

సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) స్వల్ప అస్వస్థత(Sick)కు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న రేవంత్ ప్రస్తుతం ఇంటిపట్టునే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసానికి చేరుకున్న వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జలుబు, దగ్గుతో కూడా ఇబ్బంది పడుతున్న రేవంత్‌కు వైద్యులు ఆర్టీపీసీఆర్(RTPCR) పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం.

CM Revanth Reddy: CM Revanth Reddy is sick.. Doctors will do corona test..!

తెలంగాణలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గడిచిన ఇప్పటికే రాష్ట్రం 50వరకు యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లిలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా రావడంతో వైద్యశాఖ ఇప్పటికే అప్రమత్తమైంది.

మరోవైపు, కొవిడ్(Covid) న్యూ వేరియంట్ జేఎన్1 దేశవ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికైతే తెలంగాణలో ఆ వేరియంట్ దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది.

ఇటీవల రేవంత్ వరుస సమీక్షలు, సమావేశాలతో బిజీబిజీగా గడిపారు. సీఎం రేవంత్ రెడ్డి అకస్మాత్తుగా జ్వరం బారిన పడటంతో కరోనా పరీక్షలు చేయించుకోనున్నట్లు సమాచారం. ఒకవేళ ఆయనకు పాజిటివ్ నిర్ధారణ అయితే ఇటీవల సీఎంతో పాటు సమావేశాలు, సమీక్షల్లో పాల్గొన్న మంత్రులు, అధికారులు కూడా కొవిడ్ నిర్ధరణ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.

You may also like

Leave a Comment