Telugu News » Thirumala: టీటీడీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పాలక మండలి భేటీలో కీలక నిర్ణయాలు..!

Thirumala: టీటీడీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పాలక మండలి భేటీలో కీలక నిర్ణయాలు..!

టీటీడీ పాలక మండలి భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ చైర్మన్ (TTD Chairman) భూమన కరుణాకర్‌రెడ్డి (Bhumana Karunakar Reddy) మాట్లాడుతూ.. టీటీడీ ఉద్యోగులకు వేతనాల పెంచడంతో పాటు ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

by Mano
Thirumala: Good news for TTD employees.. Key decisions in Governing Council meeting..!

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పాలకమండలి ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఇవాళ (మంగళవారం) నిర్వహించిన టీటీడీ సమావేశంలో పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ (TTD Chairman) భూమన కరుణాకర్‌రెడ్డి (Bhumana Karunakar Reddy) మాట్లాడుతూ.. టీటీడీ ఉద్యోగులకు వేతనాల పెంచడంతో పాటు ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

Thirumala: Good news for TTD employees.. Key decisions in Governing Council meeting..!

ఈనెల 28న 3,518 మందికి,  జనవరిలో మరో1500 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు భూమన తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులు, తదితరుల కోసం మరో 350 ఎకరాలు 85 కోట్లతో ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. శానిటేషన్ ఉద్యోగులు, వర్క్ కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు రూ.10వేలు పెంచాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

పోటు కార్మికులకు రూ.28వేల నుంచి 38వేలకు పెంచనున్నట్లు తెలిపారు. వాహనం బేరర్లు, ఉగ్రాణం కార్మికులు, స్కిల్ లేబర్‌గా గుర్తించి తగిన విధంగా వేతనాలు పెంచాలని నిర్ణయించామన్నారు. ఫిబ్రవరిలో రెండు రోజులు పాటు దేశవ్యాప్తంగా పీఠాధిపతులను ఆహ్వానించి సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. కల్యాణకట్టలో పీస్ రేట్ బార్బర్ల వేతనాలు కనీసం రూ.20వేలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

అదేవిధంగా  తిరుపతిలో పాత సత్రాలు తొలగించి కొత్త అతిథి గృహాల నిర్మాణం టెండర్లకు ఆమోదం తెలపనున్నట్లు తెలిపారు. తిరుపతి పారిశుధ్యం పనులు కోర్టు తుది తీర్పుకు లోబడి ఆమోదించనున్నట్లు వివరించారు. జార్ఖండ్ ప్రభుత్వం టీటీడీకి ఇచ్చిన 100 ఎకరాల్లో వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చంద్రగిరిలో మూలస్థానం ఎల్లమ్మ ఆలయానికి అభివృద్ధి పనులకు రూ.2కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

శ్రీనివాస దివ్య అనుగ్రహ యాగం చేసే భక్తులకు రూ.300 ప్రత్యేక దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు. శ్రీవారి ఆలయ పెద్ద జీయార్‌, చిన్న జీయార్‌ మఠాలకు ప్రతీ ఏటా ఇచ్చే ప్యాకేజీకి మరో రూ.కోటి, పెద్దజీయర్‌ మఠానికి రూ.2కోట్ల నుంచి రూ.2.60కోట్లు, చిన్న జీయర్‌ మఠానికి ఒక కోటి 70లక్షల నుంచి రూ.2.10కోట్లకు పెంచుతున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వివరించారు.

You may also like

Leave a Comment