Telugu News » Asaduddin : రేవంత్ సర్కార్ కు అసదుద్దీన్ స్పెషల్ రిక్వెస్ట్

Asaduddin : రేవంత్ సర్కార్ కు అసదుద్దీన్ స్పెషల్ రిక్వెస్ట్

తెలంగాణ (Telangana) ప్రభుత్వం అభయహస్తం పబ్లిక్ గవర్నెన్స్ అప్లికేషన్ పేరుతో ఈ దరఖాస్తు ఫారంను సిద్ధం చేసింది. అయితే.. ఒక్కో పథకానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా.. అందరికీ ఒకటే సిద్ధం చేసింది.

by admin

ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ (Congress). ఇచ్చిన మాటకు కట్టుబడి 2 హామీలను అమలు చేసింది. మిగిలిన వాటిపైనా ఫోకస్ పెట్టింది. దీనికి ప్రజా పాలన (Praja Palana) పేరుతో దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. పది రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి నేరుగా అధికారులు దరఖాస్తులు తీసుకోనున్నారు.

ప్రజా పాలన దరఖాస్తుకు సంబంధించిన ఫోటో ఒకటి బటయకొచ్చింది. అందులో ఏం కావాలో తెలుగులో రాసి ఉంచారు. అయితే.. ఈ దరఖాస్తుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi). ఒక్క తెలుగు (Telugu) లోనే దరఖాస్తు ఉండడంపై అభ్యంతరం తెలిపారు.

ప్ర‌జా పాల‌న ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ఉర్దూ(Urdu) భాష‌లోనూ ఉండాల‌ని అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞ‌ప్తి చేశారు. ఉర్దూలో అందుబాటులోకి తేవాల‌ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), సీఎస్ శాంతి కుమారిని కోరుతున్నామ‌ని తెలిపారు. అంద‌రూ ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకుని ల‌బ్ది పొందాల‌ని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించాల‌న్నారు.

తెలంగాణ (Telangana) ప్రభుత్వం అభయహస్తం పబ్లిక్ గవర్నెన్స్ అప్లికేషన్ పేరుతో ఈ దరఖాస్తు ఫారంను సిద్ధం చేసింది. అయితే.. ఒక్కో పథకానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా.. అందరికీ ఒకటే సిద్ధం చేసింది.

You may also like

Leave a Comment