Telugu News » BRS Shakeel Son : షకీల్ కుమారుడ్ని రప్పించే ప్రయత్నాలు.. లుకౌట్ నోటీసులు

BRS Shakeel Son : షకీల్ కుమారుడ్ని రప్పించే ప్రయత్నాలు.. లుకౌట్ నోటీసులు

సోహైల్‌ ‌‌‌‌‌‌‌కు బదులు అతని ఇంట్లో పనిచేసే అబ్దుల్ ఆసిఫ్‌‌‌‌‌‌‌‌ తానే డ్రైవ్ చేసినట్లుగా పోలీసులకు వెళ్లి చెప్పాడు. కానీ, దర్యాప్తులో అసలు నిజాలు వెలుగుచూశాయి. దీంతో సోహైల్ కు లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.

by admin
lookout-notice-issued-to-ex-mla-shakeel-son

– దుబాయ్ లో షకీల్ కుమారుడు సోహైల్
– హైదరాబాద్ కు తీసుకొచ్చే ప్రయత్నాల్లో పోలీసులు
– లుకౌట్ నోటీసుల జారీ

ప్రజా భవన్ (Praja Bhavan) దగ్గర నానా రచ్చ చేసి సైలెంట్ గా దుబాయ్ చెక్కేశాడు బీఆర్ఎస్ (BRS) నేత షకీల్ (Shakeel) కుమారుడు సోహైల్. ఎలాగైనా అతడ్ని నగరానికి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే అతడికి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ర్యాష్ డ్రైవింగ్, నిందితుడి మార్పు వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని అతడిపై కేసు పెట్టారు పోలీసులు.

lookout-notice-issued-to-ex-mla-shakeel-son

అసలేం జరిగింది..?

ఈనెల 23న అర్ధరాత్రి దాటాక ప్రజా భవన్ ముందున్న బారికేడ్లను సోహైల్​ కారు ఢీకొట్టింది. విషయం తెలిసిన పంజాగుట్ట పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. కారు నడిపింది సోహైల్ ​గా గుర్తించారు. మద్యం మత్తులో ఉన్నారడేమోనని.. బ్రీత్ ఎనలైజ్ టెస్ట్ కోసం పంజాగుట్ట స్టేషన్ ​కు పట్టుకెళ్లారు. అయితే.. అతడ్ని కేసు నుంచి తప్పించి.. అబ్దుల్ అనే మరో వ్యక్తిని నిందితుడిగా చేర్చే ప్రయత్నం జరిగింది.

దుబాయ్ చెక్కేసిన సోహైల్

ప్రమాదం తర్వాత ముంబై నుంచి దుబాయ్ వెళ్లాడు సోహైల్. కేసు నుంచి తప్పించుకునేందుకు లొంగిపొమ్మని అతనితోపాటు తండ్రి షకీల్ డ్రైవర్‌ ‌పై ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ కు సోహైల్‌ కు బదులు డ్రైవర్ వెళ్లాడు. దీని వెనుక అంతా షకీల్ వెనుకుండి నడిపించాడని అంటున్నారు. ఆరోజు రాత్రి ఆయన పోలీస్ స్టేషన్ కు వెళ్లినట్టు కూడా తెలుస్తోంది.

సీన్ రివర్స్

నిందితులను కోర్టులో హాజరు పరిచే టైమ్ లో సోహైల్ పేరు ఎఫ్ఐఆర్ ​లో లేదు. అంతర్గత విచారణ తర్వాత రిమాండ్ రిపోర్టులో మాత్రం అతడ్ని ఏ1గా చేర్చారు. అలాగే అబ్దుల్ ను ఏ2గా పేర్కొన్నారు పోలీసులు. ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేశారు. సోహైల్‌ ‌‌‌‌‌‌‌కు బదులు అతని ఇంట్లో పనిచేసే అబ్దుల్ ఆసిఫ్‌‌‌‌‌‌‌‌ తానే డ్రైవ్ చేసినట్లుగా పోలీసులకు వెళ్లి చెప్పాడు. కానీ, దర్యాప్తులో అసలు నిజాలు వెలుగుచూశాయి. దీంతో సోహైల్ కు లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.

లుకౌట్ నోటీసులు అంటే ఏంటి?

లుకౌట్ నోటీసులు అనేవి నిందితుడు దేశం విడిచి వెళ్లకుండా ఇస్తారు. అంతర్జాతీయ సరిహద్దులు, విమానాశ్రయాలు, సముద్ర ప్రాంతాలు, ఓడరేవుల వద్ద వాంటెడ్ వ్యక్తులు, నేరస్థులను పట్టుకోవడం కోసం వీటిని ఉపయోగిస్తారు. అయితే.. ఈ నోటీసులు వచ్చే లోపే సోహైల్ దుబాయ్ చెక్కేసినట్టు చెబుతున్నారు.

ఇన్‌స్పెక్టర్ పై వేటు

ఈ వ్యవహారంలో పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావు‌పై సస్పెన్షన్ వేటు పడింది. సోహైల్ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. బీపీ డౌన్ కారణంగా ఇన్‌స్పెక్టర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డీసీపీ వెస్ట్ జోన్ పూర్తి స్థాయిలో విచారిస్తున్న క్రమంలో ఇన్‌స్పెక్టర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈ కేసులో దుర్గారావు వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన డీసీపీ వెస్ట్ జోన్ ఆయనను సస్పెండ్ చేసింది.

You may also like

Leave a Comment