రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మహాలక్ష్మీ పథకం (Mahalakshmi Scheme)లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకానికి విశేష స్పందనతో.. పాటు కొన్ని కష్టాలు కూడా ఎదురవుతున్నాయి. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు.. రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రభుత్వం తెలిపింది.
అదీగాక నగరంలోని, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం ఆలస్యం.. బస్సులన్నీ కరువు బాధితుల్లా వస్తోన్న ఉచిత ప్రయాణికులతో నిండిపోతున్నాయంటున్నారు.. అయితే ఇన్ని రోజులు ఆటోల్లో వెళ్లిన మహిళలు ఉచిత ప్రయాణాన్ని ఒక రేంజ్ లో ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..
అదీగాక కొన్ని చోట్ల గొడవలు సైతం జరుగుతోన్నాయి. అందువల్ల ఈ పథకం విమర్శలకు దారితీస్తోంది.. ఇప్పటికే మగవారికి సీట్లు దొరకడం లేదనే వార్తలు వినిపిస్తుండగా.. తాజాగా, భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఉచిత ప్రయాణం వల్ల బస్సులన్ని నిండిపోతున్నాయి.. ఈ క్రమంలో ఒక మహిళ కండక్టర్.. డోర్ దగ్గర ప్రమాదకర రీతిలో నిల్చున్న మహిళలను బస్సు లోపలికి రమ్మని పిలవడం పాపమైంది.. ఆ బస్సులో ఉన్న మహిళలు కండక్టర్ నే దించేశారు. దీంతో ఆ మహిళా కండక్టర్ బూర్గంపాడులో అర్ధాంతరంగా బస్సును నిలిపివేసింది.
ఈ నేపథ్యంలో మహిళ కండక్టర్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా పరిమితికి మించి మహిళలు బస్సు ఎక్కి కనీసం కండక్టర్ను కూడా బస్సు ఎక్కనీయకుండా చేస్తున్నారని వాపోయింది. డోర్ దగ్గర ఉన్న మహిళలను లోపలికి రావాలని కోరినందుకు బూతులు తిట్టారని, తీవ్ర ఇబ్బందికి గురి చేశారని ఎమోషనల్ అయింది. కాగా ఈ ఘటనకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.